Blue Colour Roads: మీరు ఎప్పుడైనా నీలం రంగు రోడ్లను చూశారా..? దీని వెనుక అసలు కారణం ఏమిటి..?
Blue Colour Roads: మీరు వీడియోల్లోగానీ, ఫోటోలలో గానీ రకరకాల ఫోటోలను చూస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఫోటోలు నీలి రంగుల్లో ఉంటాయి. అయితే అన్ని ప్రాంతాల్లో డాంబర్‌తో వేసిన రోడ్డు..
Blue Colour Roads: మీరు వీడియోల్లోగానీ, ఫోటోలలో గానీ రకరకాల ఫోటోలను చూస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఫోటోలు నీలి రంగుల్లో ఉంటాయి. అయితే అన్ని ప్రాంతాల్లో డాంబర్‌తో వేసిన రోడ్డు నల్లగా ఉంటుంది. కానీ ఓ ప్రాంతంలో రోడ్డు నీలం రంగుల్లో ఉంటుంది. ఇలాంటి రోడ్డును మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఖతార్ దేశంలో నలుపుతో ఉన్న రోడ్డును రంగు మార్చేందుకు ప్రాజెక్టును చేపట్టింది. ఇక్కడ రోడ్లు నీలం రంగులో ఉన్నాయి. రోడ్డు ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ రంగు వేయలేదు. కానీ దాని వెనుక ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. రోడ్లకు నలుపు కాకుండా వేరే రంగుతో పెయింట్ చేసే ప్రయోగం ఖతార్ రాజధాని దోహాలో జరిగింది చేపట్టింది. ఖతార్ పరిపాలన ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను 2019 సంవత్సరంలో ప్రారంభించింది. ఇందులో దోహాలోని కొన్ని వీధులు కూడా నీలం రంగులో ఉన్నాయి. మరి అక్కడ రోడ్లను నీలం రంగులో ఉందుకు మార్చిందో చూద్దాం.
రహదారిని నీలం రంగులో ఎందుకు నిర్మించారు..? రోడ్లను నీలం రంగులో మార్చడానికి కారణాలు లేకపోలేదు. రహదారిపై నీలం రంగు ఏసీ పెయింట్ పూత పూసిన తర్వాత నీలం రంగులోకి మారుతుంది. ఇప్పటివరకు ఇది దోహాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీరం రంగు రహదారులను ఏర్పాటు చేశారు. రోడ్లుక నీలం రంగు పూయడానికి కారణం ఏంటంటే.. వేడికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్లూ కలర్ ద్వారా రోడ్డు ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఎంతో ప్రయోజనం కూడా కలుగుతోంది. ఏ రోడ్డులోనైనా ఈ ప్రత్యేక రకం పూత పూసిన తర్వాత అక్కడి ఉష్ణోగ్రతపై 50 శాతం తేడా ఉంటుందని, అందులో ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటుందని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఇలా చేస్తారు.
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రహదారులలో 1 మి.మీ. మందపాటి నీలం పూత పూస్తారు. దీనితో పాటు సైకిళ్లు, పాదచారుల కోసం కటారా క్లచ్రాల్ గ్రామం సమీపంలో 200 మీటర్ల పొడవునా ఒక మార్గాన్ని నిర్మించారు. ఈ రోడ్లకు నీలం రంగు వేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఉష్ణోగ్రత నియంత్రణ కోసమే. ఇది కాకుండా ఉష్ణోగ్రతను తెలుసుకునేందుకు ఈ రోడ్డు ప్రాంతంలో ఉష్ణోగ్రత సెన్సార్లను ఏర్పాటు చేసింది అక్కడి దేశం. ప్రయోగాత్మకంగా ఈ నీలం రంగు పూత పూయడం వల్ల సూర్యుని రేడియేషన్‌ను 50శాతం వరకు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రోడ్లకు నీలం రంగు పూతను పూస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఇలాంటి ప్రయోగం జాబితాలో లాస్ ఏంజిల్స్, మక్కా, టోక్యో వంటి దేశాలు ఉన్నాయి. దోహాలో రోడ్లకు నీలం రంగు వేసి 18 నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఖతార్ ప్రస్తుతం సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి: