Omicron and Delta Variant: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఆ ముప్పు త‌క్కువ.. రెండు అధ్య‌య‌నాలు వెల్లడి..(వీడియో)

డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌తో వ్యాధి తీవ్ర‌, ఆస్ప‌త్రిపాలయ్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని తాజాగా మ‌రో రెండు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందినా ఈ వేరియంట్‌తో తీవ్ర అస్వ‌స్ధ‌త‌కు గుర‌వ‌డం,

Omicron and Delta Variant: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఆ ముప్పు త‌క్కువ..  రెండు అధ్య‌య‌నాలు వెల్లడి..(వీడియో)

|

Updated on: Jan 07, 2022 | 8:59 AM


డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌తో వ్యాధి తీవ్ర‌, ఆస్ప‌త్రిపాలయ్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని తాజాగా మ‌రో రెండు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందినా ఈ వేరియంట్‌తో తీవ్ర అస్వ‌స్ధ‌త‌కు గుర‌వ‌డం, ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు మూడింట రెండు వంతులు త‌క్కువ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ ఎడిన్‌బ‌ర్గ్ ప‌రిశోధ‌కులు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసిన వ‌ర్కింగ్ పేప‌ర్‌లో తెలిపారు. స్కాట్లాండ్‌లో ఈ అధ్య‌య‌నాన్ని ప‌రిశోధ‌కులు నిర్వ‌హించారు. ఇక డెల్టా ఇన్ఫెక్ష‌న్స్‌తో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో ఆస్ప‌త్రిలో చేరే అవ‌కాశం 80 శాతం త‌క్కువ‌గా ఉంద‌ని, ఒకసారి ఆస్ప‌త్రిలో చేరితో తీవ్ర వ్యాధి బారిన‌ప‌డే ముప్పు మాత్రం రెండు వేరియంట్ల‌లో ఒకే విధంగా ఉంద‌ని దక్షిణాఫ్రికాలో నిర్వ‌హించిన మ‌రో అధ్య‌య‌న‌ప‌త్రం వెల్ల‌డించింది. స్కాట్లాండ్ అధ్య‌య‌నం న‌వంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 19 వ‌ర‌కూ 1,26,511 డెల్టా కేసులు, 23,840 ఒమిక్రాన్ కేసుల‌ను ప‌రిశీలించిన మీద‌ట ఈ వివ‌రాలు వెల్ల‌డించింది.

డెల్టాతో పోలిస్తే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న యువ‌త‌లో ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు మూడింట రెండు వంతులు త‌గ్గ‌డం ఒమిక్రాన్ అధిక జ‌నాభాపై స్వ‌ల్ప ప్ర‌భావం చూపుతుంద‌ని వెల్ల‌డిస్తోంద‌ని, ఈ అధ్య‌య‌నం ఊర‌ట ఇచ్చే అంశాన్ని అందించింద‌ని రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ డైరెక్ట‌ర్ జేమ్స్ నైస్మిత్ పేర్కొన్నారు.

Follow us