Joe Biden: బైడెన్ వలస విధానం అదుర్స్… టెక్ దిగ్గజాల ప్రశంసలు.. కొత్త ఉద్యోగాల సృష్టికి సాయం…
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న వలస విధానంపై టెక్ దిగ్గజాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణపై గూగుల్ సీఈఓ...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న వలస విధానంపై టెక్ దిగ్గజాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చర్య అమెరికా ఆర్థిక వ్యవస్థను పెంచడమే కాకుండా కొత్త ఉద్యోగాల సృష్టికి సాయపడుతుందని అన్నారు.
సంస్కరణల్లో వేగం…
బైడెన్ నిర్ణయాన్నిఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వాగతించారు. “ఈ ప్రయత్నం అమెరికన్ సమాజాలను బలోపేతం చేస్తుంది. అలాగే ఈ దేశం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉపయోగపడనున్నది” అని టిమ్ కుక్ ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ ఉపశమనం, పారిస్ వాతావరణ ఒప్పందంతోపాటు ఇమ్మిగ్రేషన్ సంస్కరణలపై వేగంగా చర్యలు తీసుకున్నందుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్టర్లో అధ్యక్షుడు బైడెన్‌ను ప్రశంసించారు. ఈ ముఖ్యమైన సమస్యలపై గూగుల్ మద్దతు ఇచ్చిందని, అంటువ్యాధి నుంచి అమెరికా కోలుకోవడానికి కొత్త పరిపాలనతో కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని సుందర్ పిచాయ్ తెలిపారు.