US presidential election: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో జో బైడెన్‌.. అధికారికంగా ప్రకటించిన డెమొక్రటిక్‌ పార్టీ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ మరోసారి బరిలోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించి సంచలనం సృష్టించారు బైడెన్‌. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రకటనతోపాటు.. ఓ వీడియో ద్వారా ఏకంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టేశారు జో బైడెన్‌.

US presidential election: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో జో బైడెన్‌.. అధికారికంగా ప్రకటించిన డెమొక్రటిక్‌ పార్టీ..
Joe Biden Kamala Harris
Follow us
Venkata Chari

|

Updated on: Apr 26, 2023 | 5:59 AM

అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌లో దానికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే.. అప్పుడే అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకునట్టే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశారు. కానీ.. ఆ లోపే ఆయన పోర్న్ స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసు వ్యవహారంలో దోషిగా తేలారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు నిక్కీ హేలీ కూడా ప్రకటించారు.

భారత సంతతికి చెందిన ఆమె.. రిపబ్లికన్ పార్టీ నుంచి సౌత్ కరోలినా గవర్నర్ రెండుసార్లు ఎన్నికయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంప్‌లో పని చేశారు. ఇప్పుడు తాజాగా.. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ తరపున తాను తిరిగి పోటీ చేస్తున్నట్లు మంగళవారం లాంఛనంగా ప్రకటించారు జో బైడెన్‌. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పనిలోపనిగా ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆ వీడియోతోనే ప్రారంభించారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని అమెరికన్లను కోరారు జో బైడెన్‌. ఇక.. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కూడా వచ్చే ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌గా తిరిగి పోటీ చేయనున్నట్లు బైడెన్‌ వెల్లడించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థులను ప్రధానమైన రెండు పార్టీలు ప్రైమరీస్‌ ఎన్నికల ద్వారా ఖరారు చేస్తాయి. అయితే.. అధ్యక్షుడే రెండో పర్యాయం పోటీకి దిగుతున్నానని ప్రకటించడంతో డెమొక్రాటిక్‌ పార్టీలో ప్రైమరీస్‌ ఎన్నికకు అవకాశం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

అయితే.. వచ్చే ఎన్నికల్లో బైడెన్‌ వయసు అంశం ప్రధానం కానుంది. ఒకవేళ బైడెన్‌ రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి చేసేనాటికి ఆయన దాదాపు 86 ఏళ్లకు చేరుకోనున్నారు. దాంతో.. వయసు రీత్యా బైడెన్‌కు అమెరికన్లు మరో అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాలి మరి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..