Watch: అయ్యో పాపం చిన్ని ప్రాణం.. కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి 48 కిలోమీటర్లు నరకయాతన..!
వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ సంఘటన చాలా భయానకంగా ఉంది. దాంతో వెంటనే కారు ఇంజిన్ బానెట్ ఓపెన్ చేసి దానిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను ఆవేదనకు గురిచేస్తుంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ దీనిపై తీవ్రంగా స్పందించారు.
జీవితంలో చాలా సార్లు మన కళ్ల ముందు జరిగే కొన్ని సంఘటనలు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. అలాంటిదే ఈ ఘటన కూడా. కారు ఇంజన్‌లో ఇరుక్కున్న ఓ చిన్న కుక్కపిల్ల 48 కి.మీ మేర కేకలు వేస్తూ తల్లడిల్లింది. ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చాలా సేపటి తర్వాత గానీ, ఆ కుక్కపిల్ల అరుపులు విన్న కారులో ఉన్నవారు..ఎట్టకేలకు దాన్ని బయటకు తీశారు. ఈ ఘటన అమెరికాలోని కాన్సాస్‌లో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ సంఘటన చాలా భయానకంగా ఉంది. పాపం ఆ చిన్ని కుక్కపిల్ల బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే, చివరికి కుక్కపిల్లను సజీవంగా ఇంజిన్ నుండి బయటకు తీయటం చూసిన అందరూ వారిని కొనియాడుతున్నారు.
me: getting to work early yesterday to catch up on some things.
this little dog: let’s do this instead! pic.twitter.com/qcO7HQ4rxn
— Carrie Lippert Gillaspie (@CarrieGillaspie) April 20, 2023
ఒక వ్యక్తి కాన్సాస్ నుండి మిస్సౌరీకి దాదాపు యాభై కిలోమీటర్లు ప్రయాణించాడు. అక్కడికి వెళుతుండగా కారు ఇంజిన్‌లో ఓ చిన్ని కుక్కపిల్ల ఇరుక్కుపోయిందని కారులో ఉన్న ఎవరికీ తెలియలేదు. ఈ కారు ఇంజిన్‌లో ఒక చిన్న కుక్కపిల్ల ఇరుక్కుపోయింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, చిన్న కుక్కపిల్ల తెలియకుండానే కారు ఇంజిన్‌లోకి దూరింది. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయింది. కారు డ్రైవర్‌కు బహుశా దీని గురించి తెలియదు. ఈ స్థితిలో అతను కాన్సాస్ నుండి మిస్సౌరీకి సుమారు 30 మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత అందరూ అక్కడికి చేరుకున్నాక ఒక మహిళ కుక్కపిల్ల అరుపులు విన్నది. దాంతో తన కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఇంజన్‌లో కుక్క ఇరుక్కుపోయి కనిపించింది..దాంతో వెంటనే కారు ఇంజిన్ బానెట్ ఓపెన్ చేసి దానిని బయటకు తీశారు. అది బ్రతికినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ కుక్కను రక్షించి ఆహారం, నీరు అందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..