Viral News: చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలు! ఇదో సరికొత్త బిజినెస్.. ఎక్కడంటే.!
సృష్టిలో మానవుడు దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అంతే కాదు తన మేధాశక్తితో తోటి మానవులనే కాక ఇతర జీవులను..
సృష్టిలో మానవుడు దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అంతే కాదు తన మేధాశక్తితో తోటి మానవులనే కాక ఇతర జీవులను శాసిస్తున్నాడు. అలాంటి మనిషిని మృత్యువు అనే ఒక చిన్న స్పర్శ ఓడిస్తోంది. మనిషి మరణించిన వెంటనే అతను ఎంతటివాడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. చినిగి.. చినిగి.. పాడైపోయిన పాత చెప్పులనైనా ఇంట్లో ఉంచుకుంటారు గానీ.. మనిషి మరణించిన తరువాత మరుక్షణం కాటికి పంపించే కార్యక్రమం మొదలు పెడతారు. చివరికి మట్టిలో కలిపేస్తారు. అయితే ఇక్కడ ఒక మహిళ చనిపోయిన వ్యక్తుల అవశేషాలు అలా వృధాగా మట్టిపాలు కాకూడదనుకుందో ఏమో… మరణించిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలను తయారు చేస్తోంది.
మెల్‌బోర్న్‌కి చెందిన జాక్కి విలియమ్స్ అనే మహిళ చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలను తయారు చేస్తోంది. గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీలో చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో వారి కుటుంబాలకు ఉంగరాలు, కంఠహారాలు తయారు చేస్తోంది. ఇలా ఒక బిజినెస్ కూడా మొదలుపెట్టిందట.
తనని తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబం కోసం ఐయూడీని ఉపయోగించి ఓ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చారట విలియమ్స్. ఆ విధంగా ఈ వ్యాపారం మొదలుపెట్టారట. ఈ ఆభరణాలను తయారు చేయడానికి సుమారు ఎనిమిది వారాలు పడుతుందట. వీటి ధర 350 నుంచి 10 వేల డాలర్ల వరకు ఉంటుందని తెలిపారు. మరణం పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఆశయంతోనే తను ఈ పని చేస్తున్నారట. గ్రేవ్ మెటాలమ్ అనే వెబ్‌సైట్‌లో వీటిని విక్రయానికి పెట్టినట్లు జాక్కి విలియమ్స్ పేర్కొన్నారు.
Also Read:
పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!
ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!