ఇండియాకు దెబ్బ.. వ్యవసాయ సబ్సిడీలకు కోత ?

వ్యవసాయ సబ్సిడీల విషయంలో ఇండియాను దెబ్బ తీసేలా అగ్ర రాజ్యాలు ప్రయత్నిస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ముఖ్యంగా వ్యవసాయ సబ్సిడీలకు కోత విధించేట్టు జపాన్ చేయనున్న ఓ ప్రతిపాదన..ప్రధానంగా వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ టీ ఓ) నిబంధనలను మార్చే దిశగా సాగుతోంది. ఈ ప్రతిపాదనను అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు సమర్థించనున్నాయి. ఇప్పటికే సబ్సిడీ నోటిఫికేషన్ ప్రాసెస్ లో వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొంత వివాదంలో పడింది. వ్యవసాయ సబ్సిడీలు […]

ఇండియాకు దెబ్బ.. వ్యవసాయ సబ్సిడీలకు కోత  ?
Follow us

|

Updated on: May 28, 2019 | 2:45 PM

వ్యవసాయ సబ్సిడీల విషయంలో ఇండియాను దెబ్బ తీసేలా అగ్ర రాజ్యాలు ప్రయత్నిస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ముఖ్యంగా వ్యవసాయ సబ్సిడీలకు కోత విధించేట్టు జపాన్ చేయనున్న ఓ ప్రతిపాదన..ప్రధానంగా వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ టీ ఓ) నిబంధనలను మార్చే దిశగా సాగుతోంది. ఈ ప్రతిపాదనను అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు సమర్థించనున్నాయి. ఇప్పటికే సబ్సిడీ నోటిఫికేషన్ ప్రాసెస్ లో వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొంత వివాదంలో పడింది. వ్యవసాయ సబ్సిడీలు ఎంత కావాలో, ఏ మేరకు అవసరమో ఖఛ్చితంగా తెలియజేయాలన్నది ఈ నిబంధనల్లో ఒకటి.. దీన్ని తెలియజేయకపోతే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందట. వ్యవసాయంపై డబ్ల్యు టీ ఓ ఒప్పందం ప్రకారం ఒక పేద, లేదా వర్ధమాన దేశం తన వ్యవసాయోత్పత్తుల విలువలో 10 శాతానికి పైగా సబ్సిడీలను కోరజాలదు. అయితే ధనిక దేశాల విషయంలో ఇది 5 శాతం ఉంది. భారత్-చైనా దేశాలు తమ సబ్సిడీల విషయంలో వక్రీకరించి నివేదికలు ఇస్తున్నాయని అమెరికా సహా పలు ధనిక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ దేశాలు గ్లోబల్ ట్రేడ్ ను తప్పుదారి పట్టిస్తున్నాయని తప్పు పడుతున్నాయి. ఒసాకాలో జూన్ 28, 29 తేదీల్లో జీ-20 సమ్మిట్ ను నిర్వహిస్తున్న జపాన్ ఈ సమస్యను ప్రధాన అజెండాగా ప్రస్తావనకు తీసుకురావచ్చు. తన ప్రతిపాదన ఆమోదయోగ్యమయ్యేలా ఇతర దేశాలను గట్టిగా ఒప్పించడానికి యత్నించ వచ్చు. జెనీవా బేస్డ్ మల్టీలేటరల్ ట్రేడ్ బాడీని ‘ సంస్కరించాలన్న ‘ తమ డిమాండులో భాగమే ఇదని జపాన్ చెప్పుకుంటోంది..ఒకవేళ ఈ ప్రతిపాదనకు అన్ని దేశాల ఆమోదం లభిస్తే. . వ్యవసాయ సబ్సిడీల విషయంలో ఇండియాకు ఊహించని దెబ్బే ఎదురుకావచ్ఛునని భావిస్తున్నారు.

Latest Articles
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్