AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇజ్రాయెల్ లో తీవ్ర ఉద్రిక్తత..రోడ్లపైకి వచ్చిన వేలాది మంది నిరసనకారులు

ఇజ్రాయిల్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని బెంజిమన్ నేతన్యాహూకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. వేలాది మంది ప్రజలు నిరసన బాట పట్టారు. ఇజ్రాయిల్ జెండాలు పట్టుకొని భారీ ర్యాలీగా తరలివచ్చి తమ గళం వినిపించారు.

ఇజ్రాయెల్ లో తీవ్ర ఉద్రిక్తత..రోడ్లపైకి వచ్చిన వేలాది మంది నిరసనకారులు
Protest At Israel
Aravind B
|

Updated on: Mar 27, 2023 | 7:31 PM

Share

ఇజ్రాయిల్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని బెంజిమన్ నేతన్యాహూకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. వేలాది మంది ప్రజలు నిరసన బాట పట్టారు. ఇజ్రాయిల్ జెండాలు పట్టుకొని భారీ ర్యాలీగా తరలివచ్చి తమ గళం వినిపించారు. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో తనను తాను కాపాడుకోవాలని చూస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, సైనికులు వారిపై భాష్పవాయువు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని జైలు శిక్ష పడకుండా తనను తాను కాపాడుకునేందుకు న్యాయవస్థలో సంస్కరణల పేరుతో మార్పులు చేయాలనుకుంటున్నారు.

అయితే ఇందులో జడ్జీల నియామకం, ప్రభుత్వం జారీ చేసిన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కోర్టులకు లేకుండా చేయడం లాంటి విధానాలు ఈ సంస్కరణల్లో ఉన్నాయి. అయితే దీన్ని అమలు చేయవద్దని తెప్పిన రక్షణ మంత్రిని కూడా నెతన్యాహూ ఇటీవల పదవి నుంచి తొలగించారు.రక్షణమంత్రికి మద్దతుగా, న్యాయవ్యవస్థలో సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో విమాన సేవలను అధికారులు నిలిపివేశారు. ఎయిర్‌ పోర్టు వర్కర్క్‌ యూనియన్ సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇజ్రాయెల్ కి అతిపెద్ద ట్రేడ్ యూనియన్ సమ్మెకు దిగడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వర్తల కోసం