Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeys Attack: నిన్న కుక్కలు… ఇవాళ కోతులు.. పిల్లలపై పెరుగుతున్న దాడులు

హైదరాబాద్‌లో కుక్కలు కరిచేస్తుంటే, భద్రాద్రి కొత్తగూడెంలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. అవి ఎదురొచ్చినా, మనం వాటికి ఎదురెళ్లినా అంతే సంగతులన్నట్టుగా రెచ్చిపోతున్నాయి.

Monkeys Attack: నిన్న కుక్కలు... ఇవాళ కోతులు.. పిల్లలపై పెరుగుతున్న దాడులు
Untitled 1
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 27, 2023 | 1:43 PM

అసలే కోతి.. ఆపై వనం వీడింది.. జనంలోకి వచ్చింది. కాయలు, పండ్లే కాదు, మనుషుల్లాగే అన్ని రకాల​ఫుడ్‌కు అలవాటు పడ్డాయి. ఆహారం కోసం ఇండ్ల మీద దాడులు చేస్తున్నాయి. ఊరూరా తిరుగుతూ.. మనుషులపైనే తిరగబడుతున్నాయి. కోతులను పట్టుకునేందుకు మనిషి చేస్తున్న అన్ని ప్రయత్నాలు, కోతుల తెలివితేటల ముందు తేలిపోతున్నాయి.

హైదరాబాద్‌లో కుక్కలు కరిచేస్తుంటే, భద్రాద్రి కొత్తగూడెంలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. అవి ఎదురొచ్చినా, మనం వాటికి ఎదురెళ్లినా అంతే సంగతులన్నట్టుగా రెచ్చిపోతున్నాయి. వెంటబడిమరీ కరిచేస్తున్నాయి. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను సైతం వదిలి పెట్టడంలేదు. వెంబడించి మరీ దాడికి తెగబడుతున్నాయి.

భద్రాచలంలో ఎక్కడ చూసినా కోతులే కోతులు. ఆఫీసూ, ఇళ్లు, పొలం, గుడిబడీ ఎక్కడ చూసినా కోతుల గుంపులే. ఎనీ ప్లేస్‌ ఎనీ సెంటర్‌ తమదే అడ్డా అన్నట్టుగా రెచ్చిపోతున్నాయి. వానర గుంపు చేసే రచ్చతో భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలు సైతం విలవిల్లాడిపోతున్నాయి. తాజాగా స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. స్కూల్ కు వెళ్తుండగా విద్యార్థులను చుట్టు ముట్టాయి కోతులు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిని తరిమేశాయి. ఓ చిన్నారిపై దాడి చేసిన కోతులు.. తీవ్రంగా గాయపర్చాయి. అటుగా ఓ వ్యక్తి రావడంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. గాయపడ్డ చిన్నారి వైష్ణవిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి.

వానరాలు సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. అంతేకాదు బైక్స్‌ సీట్స్‌ కవర్లు చింపేయడం, విలువైన పత్రాలు ఎత్తుకుపోవడం, స్కూలూ-ఇళ్లల్లోకి చొరబడి ఆహారం లాక్కెళ్లిపోతుండటంతో జనం హడలిపోతున్నారు. కోతుల బెడద నుంచి తమను కాపాడేవాడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయిందంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..