Israel Hamas War: గాజాలో అతిపెద్ద ఆస్పత్రివద్ద బాంబుల మోత.. పెరుగుతున్న మహిళల, చిన్నారుల మరణాలు..

|

Nov 14, 2023 | 7:32 AM

ఫ్రాన్స్ సహా పలు దేశాలు.. కాల్పులు విరమించాలని ఇజ్రాయెల్‌‌ని కోరుతున్నాయి. రక్షణ కోసం పోరాటం చేసే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. కానీ గాజాలో బాంబు దాడులను ఆపాలని విజ్ఞప్తి చేస్తోంది. హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనే క్రమంలో మహిళలు, చిన్నారులను చంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గల్లాంత్‌ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ గాజా స్ట్రిప్‌ పై హమాస్‌  పట్టు కోల్పోయిందని వెల్లడించారు.

Israel Hamas War: గాజాలో అతిపెద్ద ఆస్పత్రివద్ద బాంబుల మోత.. పెరుగుతున్న మహిళల, చిన్నారుల మరణాలు..
Israel Hamas War
Follow us on

ఇరువర్గాల మద్యం, ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినా గెలుపు ఎవరిదైనా .. ఇరు వర్గాలకు నష్టం తప్పదు.  అవును ఒక్కసారి యుద్ధం మొదలయ్యాక ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ గెలుపెవరిదైనా అమాయక ప్రజలే తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలోనూ అదే జరుగుతోంది. ప్రాణాలు పోసే ఆస్పత్రుల్లో సైతం ప్రాణాలు పోతున్న తీరు అందరినీ కలచివేస్తోంది.

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య భీకర పోరుతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్‌-షిఫా దగ్గర హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఆస్పత్రి కింద హమాస్‌ ప్రధాన కమాండ్‌ సెంటర్‌ ఉందని అనుమానిస్తున్న ఇజ్రాయెల్‌ దళాలు దాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఈ హాస్పిటల్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వైద్యపరికరాలు, మందుల సరఫరాకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడటంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మూడు రోజులుగా విద్యుత్, నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అత్యవసర సాయం సైతం అందించలేకపోతున్నామని ఆస్పత్రి వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాయి. ఆస్పత్రి సమీపంలో కాల్పులు, బాంబు దాడులత దద్దరిల్లుతోంది. మరోవైపు రోగుల మరణాలు గణనీయంగా పెరుగుతుండటం దిగ్ర్భాంతిని కలిగించే అంశం.

ప్రజలకు సురక్షిత ప్రాంతాలుగా ఉండాల్సిన ఆస్పత్రుల్లో.. మరణాలు, నిరాశ, నిస్పృహలతో కూడిన దృశ్యాలు కన్పిస్తున్నాయి. శవాలను ఖననం చేయడానికి కూడా అవకాశం లేక, శవాలు పేరుకుపోతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తక్షణమే కాల్పులను విరమించాలని పిలుపునిచ్చింది. లేదంటే ప్రపంచం మౌనంగా ఉండబోదని హెచ్చరించింది. ఫ్రాన్స్ సహా పలు దేశాలు.. కాల్పులు విరమించాలని ఇజ్రాయెల్‌‌ని కోరుతున్నాయి. రక్షణ కోసం పోరాటం చేసే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. కానీ గాజాలో బాంబు దాడులను ఆపాలని విజ్ఞప్తి చేస్తోంది. హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనే క్రమంలో మహిళలు, చిన్నారులను చంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే తాజాగా ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గల్లాంత్‌ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ గాజా స్ట్రిప్‌ పై హమాస్‌  పట్టు కోల్పోయిందని వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదులు దక్షిణ గజావైపు పారిపోతున్నారని.. వారి స్థావరాలను ప్రజలు ఆక్రమించుకుంటున్నారని ప్రకటించారు. వాస్తవంలో గాజా ప్రజలకు అక్కడ ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. అయితే ఇందుకు తగిన ఆధారాలను మాత్రం బయటపెట్టలేదు. ఇదే సమంయంలో గాజా తాజా పరిస్థితిపై ఆ ప్రాంత ఆరోగ్య సహాయ మంత్రి యూసెఫ్‌ అబు రిష్‌ స్పందించారు.

గాజాలోని అన్ని ఆస్పత్రిలోని పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వెల్లడించారు. ఇంధనం, విద్యుత్‌ తీవ్ర కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గాజాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సాధారణ పౌరులకు పారాచూట్ల ద్వారా సాయం అందించాలని ఐక్య రాజ్య సమితి, యూరోపియన్ దేశాలు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…