Hijab: హిజాబ్ చట్టాలను ఉల్లంఘిస్తే ఆ దేశంలో పదేళ్లపాటు జైలు శిక్ష
Iran Hijab Bill: అఫ్ఘానిస్థాన్‌లో మహిళలపై ఎలాంటి అణిచితేవత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో సంప్రదాయ ముస్లిం దేశం కూడా మహిళలపై అణచివేతను కొనసాగిస్తోంది. తాజాగా మహిళల డ్రెస్ కోడ్‌పై ఇరాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు కచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే హిజాబ్ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలతో పాటు వారికి మద్దతు తెలిపే వారిపై కూడా కఠినమైన శిక్షలు విధించేందుకు సిద్ధమైపోయింది.
అఫ్ఘానిస్థాన్‌లో మహిళలపై ఎలాంటి అణిచితేవత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో సంప్రదాయ ముస్లిం దేశం కూడా మహిళలపై అణచివేతను కొనసాగిస్తోంది. తాజాగా మహిళల డ్రెస్ కోడ్‌పై ఇరాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు కచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే హిజాబ్ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలతో పాటు వారికి మద్దతు తెలిపే వారిపై కూడా కఠినమైన శిక్షలు విధించేందుకు సిద్ధమైపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఓ ప్రత్యేక బిల్లును తీసుకొచ్చింది ఇరాన్ ప్రభుత్వం. ఈ ప్రత్యేకమైన బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ బుధవారం నాడు ఆమోదం కూడా తెలిపింది.
అంతేకాదు.. హిజాబ్ ధరించకుండా విధులు నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చే వ్యాపార సంస్థలతో సహా హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేసే కార్యకర్తలపై కూడా కఠినమైన శిక్షలు విధించనుంది. ఒకవేళ ఈ చట్టాన్ని ఎవరైన ఉల్లంఘించినట్లైతే వారికి కనీసం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేలా ప్రతిపాదన చేసింది. మొత్తం 290 మంది సభ్యులు కలిగిన ఇరాన్ పార్లమెంటులోని 152 మంది సభ్యులు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే ఈ బిల్లు రాజ్యాంగపరమైన నిఘా సంస్థగా పనిచేసే మతాధికార సంస్థ గార్డియన్ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. గత ఏడాది కూడా హిజాబ్ వివాదం వల్ల పోలీస్ విచారణలో మహసా అమిని అనే 22 ఏళ్ల యువతి మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే. అయితే యువతి మృతిచెంది సరిగ్గా సంవత్సరం పూర్తైన సందర్భంగా ఇరాన్ ప్రభుత్వం ఈ బిల్లును అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరో విషయం ఏంటంటే ఇప్పటికే ఇరాన్ దేశంలో మహిళలపై చాలావరకు ఆంక్షలు ఉన్నాయి. అంతేకాదు వాళ్ల డ్రెస్ కోడ్‌పై మోరల్ పోలీసుల నిఘా కూడా ఉంటుంది. హిజాబ్ సరిగా ధరించలేదనే కారణం వల్ల మహిసాను గత సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన మోరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆమె పోలీసు విచారణలో మృతి చెందింది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఎంతోమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనసు చేశారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 నెలల పాటుగా హిజాబ్, మోరల్ పోలీసింగ్ వ్యతిరేక నినాదాలతో, నిరసనలతో ఇరాన్ దేశం అట్టుడికిపోయింది. అంతేకాదు మరో విషాదం ఏంటంటే ఈ నిరసనల్లో సుమారు 500 మందికిపైగా పౌరులు చనిపోవడం అప్పట్లో సంచలనం రేపింది. దాదాపు 22 వేల మందికి పైగా నిరసనకారులను అక్కడి అధికారులు నిర్బంధించేశారు. ఇరాన్‌లో 1979 విప్లవం జరిగింది. ఆ తర్వాత అంతటి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం కూడా ఇదే తొలిసారు. ఇక చివరికి ప్రజల నిరసనల వల్ల దిగివచ్చిన ఇరాన్ ప్రభుత్వం మోరల్ పోలీసింగ్ వ్యవస్థను కూడా నిషేధించేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..