Ban on Burqas: అక్కడ బుర్ఖా వేసుకుంటే ఫైన్.. పార్లమెంట్ సభల్లోనూ ఆమోదం.

Ban on Burqas: అక్కడ బుర్ఖా వేసుకుంటే ఫైన్.. పార్లమెంట్ సభల్లోనూ ఆమోదం.

Anil kumar poka

|

Updated on: Sep 22, 2023 | 4:22 PM

స్విట్జర్లాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ బుర్ఖాలను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలిపింది. బుర్ఖా కానీ, మరో వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇక మీదట స్విట్జర్లాండ్ లో నేరంగా పరిగణించనున్నారు. 151 - 29 ఓట్ల తేడాతో నేషనల్ కౌన్సిల్ ఈ బిల్లుకు తుది ఆమోదం చెపింది. ఇప్పటికే ఈ బిల్లుకు ఎగువ సభ కూడా ఆమోదం తెలపడంతో ఇక చట్ట రూపం దాల్చినట్టుగానే భావించొచ్చంటున్నారు.

స్విట్జర్లాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ బుర్ఖాలను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలిపింది. బుర్ఖా కానీ, మరో వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇక మీదట స్విట్జర్లాండ్ లో నేరంగా పరిగణించనున్నారు. 151 – 29 ఓట్ల తేడాతో నేషనల్ కౌన్సిల్ ఈ బిల్లుకు తుది ఆమోదం చెపింది. ఇప్పటికే ఈ బిల్లుకు ఎగువ సభ కూడా ఆమోదం తెలపడంతో ఇక చట్ట రూపం దాల్చినట్టుగానే భావించొచ్చంటున్నారు. స్విస్ పీపుల్స్ పార్టీ ఈ బిల్లును ప్రతిపాదించింది. నిజానికి రెండేళ్ల క్రితమే స్విట్జర్లాండ్ వ్యాప్తంగా దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. నిఖాబ్ ధారణకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. ఇక ఇది చట్ట రూపం దాల్చినందున దీన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించనున్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా బుర్ఖా ధరిస్తే 1,000 స్విస్ ఫ్రాంక్ లను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే 91,300 రూపాయలు అన్నమాట. బహిరంగ ప్రదేశాలతోపాటు, ప్రజలు వినియోగించుకునే ప్రైవేటు ప్రదేశాల్లోనూ ముక్కు, నోరు, కళ్లను కప్పి వేయకూడదని కొత్త చట్టం చెబుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..