Mattagudise Fish: మీరెప్పుడైనా మట్టగుడిసె చేప తిన్నారా..! ఎందుకు ఈ చేపకు అంత డిమాండ్..

Mattagudise Fish: మీరెప్పుడైనా మట్టగుడిసె చేప తిన్నారా..! ఎందుకు ఈ చేపకు అంత డిమాండ్..

Anil kumar poka

|

Updated on: Sep 22, 2023 | 4:55 PM

నాన్ వెజిటేరియన్స్ లొట్టలేసుకుని తినే వంటకం ఏంటంటే చేపల పులుసు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం చేపలు ఫేమస్. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ప్రత్యేకంగా దొరికే కొన్ని రకాల చేపలు ఉంటాయి. సముద్రంలో దొరికే అరుదైన చేపల గురించి చాలామందికి తెలియదు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో పులస ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు.

నాన్ వెజిటేరియన్స్ లొట్టలేసుకుని తినే వంటకం ఏంటంటే చేపల పులుసు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం చేపలు ఫేమస్. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ప్రత్యేకంగా దొరికే కొన్ని రకాల చేపలు ఉంటాయి. సముద్రంలో దొరికే అరుదైన చేపల గురించి చాలామందికి తెలియదు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో పులస ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు. ఇక ఇదే రాష్ట్రంలోని దక్షిణ కోస్తాలో.. అదీ నెల్లూరు జిల్లాలో మాత్రమే విరివిగా దొరికే చేపల్లో మట్టగుడిస చేప చాలా ఫేమస్. కొర్రమీనుగా చెప్పుకునే చేపను పోలి ఉంటుంది ఈ మట్టగుడిస. దీనినే ఈ ప్రాంతంలో గరిగండి అని కూడా అంటారు. చెరువుల్లో, సన్నటి జలప్రవాహం ఉండే చిన్న చిన్న నదుల్లో ఎక్కువగా ఉంటాయి .ఈ రకం చేపలు పులుసు కూరకు స్పెషల్. అందులోనూ నెల్లూరు చేపల పులుసు మరీ ఫేమస్. నెల్లూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలవారికి తెగ నచ్చే వెరైటీ చేపల పులుసు. అందులోనూ మట్టగుడిస పులుసు అయితే అంతకు మించిన టేస్ట్. ఇటీవల నెల్లూరు జిల్లాలో దొరికే ఈ చేపలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ లో దొరికే ఈ చేపలను తీసుకెళ్లి మీరే ఇంట్లో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు తయారు చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..