AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమెరికాలో చేయకూడని పని చేస్తూ దొరికిన భారతీయ మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..?

ఓ మహిళ అమెరికాకు వెళ్లింది. ఆ దేశాన్ని చూసి వస్తే సరిపోతుండే.. కానీ చేయకూడని పని చేసి కటకటాల పాలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరాయి దేశంలో ఇండియా పరువు తీసిందంటూ కొందరు.. డబ్బులు ఇచ్చి తప్పించుకోవాలని అనుకుంది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Watch: అమెరికాలో చేయకూడని పని చేస్తూ దొరికిన భారతీయ మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..?
Indian Woman Arrest In Us
Krishna S
|

Updated on: Jul 16, 2025 | 3:29 PM

Share

దేశం కానీ దేశంలో చేయకూడని పని చేస్తూ దొరికిపోయింది భారత్‌కు చెందిన ఓ మహిళ. చివరకు పోలీసులకు చిక్కి.. కటకటాలపాలయ్యింది. తనపై కేసు నమోదు చేయొద్దని.. అవసరమైతే డబ్బులు ఇస్తానని పోలీసులను ప్రాధేయపడిన లాభం లేకుండా పోయింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ భారతీయ మహిళ అమెరికాను సందర్శించడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని టార్గెట్ స్టోర్‌కు ఆమె వెళ్లింది. అయితే ఆ స్టోర్‌లో ఏకంగా ఆ మహిళ 7గంటలు గడిపింది. ఆ తర్వాత పలు వస్తువులు తీసుకుని.. డబ్బులు కట్టకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1300 డాలర్ల విలువైన వస్తువులను ఆమె దొంగిలించిందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఈ మహిళ గత 7 గంటలుగా స్టోర్‌లోనే తిరుగుతుంది. ఆమె వస్తువులను తీసుకుంటూ, తన ఫోన్‌ను తనిఖీ చేస్తూ చివరకు డబ్బులు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను పట్టుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చాం’’ అని సిబ్బంది చెప్పారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్నాక.. అవసరమైతే డబ్బు చెల్లిస్తానని.. అరెస్ట్ చేయొద్దని మహిళ ప్రాధేయపడింది. భారత్ లోనూ ఇలానే వస్తువులు దొంగలించడానికి పర్మిషన్ ఉందా..?  డబ్బు ఇస్తే వదిలేస్తారా..? అంటూ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆమెను ప్రశ్నించింది. పోలీసులు ఆమెపై ఇంకా కేసు నమోదు చేయలేదు.  అదుపులోకి తీసుకుని ఆరోపణలపై విచారణ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ దేశానికి అతిథిగా వెళ్లి అక్కడి చట్టాలను ఉల్లంఘించే ధైర్యం చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటే.. ఆమె కచ్చితంగా తెలిసే ఇదంతా చేసిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటే డబ్బు చెల్లించి బయటపడదామని ఆ మహిళ అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఒకరు కామెంట్ చేయగా.. పరాయి దేశంలో భారత్‌ పరువు తీసిందని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..