AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగపూర్ లో భారత సంతతి వ్యక్తికి ఉరి.. విఫలమైన 11ఏళ్ల పోరాటం

సింగపూర్‌(Singapore) లో డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష పడింది. నిందితుడు నాగేంద్రన్‌కు శిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చాలని 11 ఏళ్లుగా సాగిన పోరాటం ఫలించలేదు. క్షమాభిక్ష కోసం 11 ఏళ్లుగా సాగుతున్న పోరాటం....

సింగపూర్ లో భారత సంతతి వ్యక్తికి ఉరి.. విఫలమైన 11ఏళ్ల పోరాటం
Justice
Ganesh Mudavath
|

Updated on: Apr 28, 2022 | 1:47 PM

Share

సింగపూర్‌(Singapore) లో డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష పడింది. నిందితుడు నాగేంద్రన్‌కు శిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చాలని 11 ఏళ్లుగా సాగిన పోరాటం ఫలించలేదు. క్షమాభిక్ష కోసం 11 ఏళ్లుగా సాగుతున్న పోరాటం చివరకు విఫలమైంది. నాగేంద్రన్ ధర్మలింగం మానసిక స్థితి సరిగ్గా లేదని ఆయనకు విధించిన ఉరి శిక్షలను రద్దు చేయాలని అంతర్జాతీయంగా పోరాటం సాగినా సింగపూర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా కనికరించలేదు. చివరకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నాగేంద్రన్ ధర్మలింగంకు ఉరిశిక్షను అమలు చేశారు. మలేషియా పౌరుడైన భారత సంతతికి చెందిన నాగేంద్రన్ ధర్మలింగంను 2009లో సింగపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో ఆయన నిందితుడు.. హెరాయిన్‌ను అక్రమ రవాణా చేస్తున్నాడని ఆయన మీద అభియోగం ఉంది. ఈ కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్‌కు 2010లో అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. తనపై నేరారోపణను కొట్టేయాని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను 2011లో కోర్టు తిరస్కరించింది. ఉరిశిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని 2015లో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టేశారు.

నాగేంద్రన్‌ 2019లో చేసుకున్న మరో అప్పీల్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. క్షమాభిక్ష కోసం సింగపూర్‌ అధ్యక్షునికి పెట్టుకున్న పిటిషన్‌ కూడా తిరస్కారానికి గురైంది. నాగేంద్రన్‌కు బెదిరించి అక్రమంగా డ్రగ్స్‌ రవాణా చేయించారని, ఆయన అమాయకుడని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగేంద్రన్‌ను గతేడాది నవంబర్​ 10నే ఉరి తీయాల్సి ఉండగా ఆయనకు కరోనా సోకడంతో వాయిదా వేశారు. నాగేంద్రన్‌కు ఉరిశిక్ష వద్దంటూ పిటిషన్‌ మీద ఏకంగా 56,134 మంది సంతకాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి.

Aadhaar Alert: అక్కడి నుంచి ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేస్తున్నారా జాగ్రత్త..!

Nani: ఓటీటీ విడుదల కానున్న న్యాచురల్ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..