Aadhaar Alert: అక్కడి నుంచి ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేస్తున్నారా జాగ్రత్త..!
Aadhaar Alert: మీరు ఇంటర్నెట్ సెంటర్ల నుంచి ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వాస్తవానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDIA) ఆధార్ కార్డ్
Aadhaar Alert: మీరు ఇంటర్నెట్ సెంటర్ల నుంచి ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వాస్తవానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDIA) ఆధార్ కార్డ్ వినియోగదారులందరికీ హెచ్చరిక జారీ చేసింది. UIDAI ఇటీవల తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసింది. పబ్లిక్ కంప్యూటర్ నుంచి ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేయకుండా వినియోగదారులను హెచ్చరించింది. ఒకవేళ మీరు పబ్లిక్ కంప్యూటర్ నుంచి ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఎవరైనా దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. పబ్లిక్ కంప్యూటర్ల వినియోగాన్ని నివారించాలని పేర్కొంది. ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తే వెంటనే ఈ-ఆధార్ కాపీలను తొలగించాలని సూచించింది.
మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలని యూఐడీఏఐ ట్వీట్‌లో పేర్కొంది. దయచేసి ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడానికి ఇంటర్నెట్ కేఫ్‌లు, పబ్లిక్ కంప్యూటర్‌లను ఉపయోగించకూడదని తెలిపింది. మీరు అలా చేస్తే e Aadhaar డౌన్‌లోడ్ చేసిన అన్ని కాపీలను తొలగించడం మంచిదని సూచించింది. ఆధార్ కార్డ్ ముఖ్యమైన పత్రాలలో ఒకటి. ఇది భారతీయ పౌరులందరికీ UIDAI జారీ చేసిన 12 అంకెల ఉచిత గుర్తింపు సంఖ్య.
మీ ఆధార్ వినియోగ సమాచారాన్ని పొందడానికి ముందుగా UIDAI వెబ్‌సైట్ ని సందర్శించండి. ఆధార్ సేవలపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ స్క్రీన్‌పై న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత ఆధార్ హిస్టరీ ఎంపిక చూస్తారు. దానిపై క్లిక్ చేయాలి. 12 అంకెల ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు Send OTPపై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 6 అంకెల OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఓకె బటన్‌పై క్లిక్ చేయండి. గత 6 నెలల్లో మీ ఆధార్ కార్డ్ ఎప్పుడు మరియు ఎక్కడఉపయోగించారో దీని ద్వారా తెలుస్తుంది.
#BewareOfFraudsters To download an e-Aadhaar please avoid using a public computer at an internet café/kiosk. However, if you do, then it is highly recommended to delete all the downloaded copies of #eAadhaar. pic.twitter.com/f3dylN1uDb
— Aadhaar (@UIDAI) April 26, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి