Hindustan Unilever: HUL నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల.. రూ.19 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..

FMCG రంగ దిగ్గజం HUL తన మార్చి త్రైమాసిక ఫలితాలను ( Q4 Result) విడుదల చేసింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్టాండ్‌లోన్ లాభం రూ. 2,327 కోట్లుగా ఉంది...

Hindustan Unilever: HUL నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల.. రూ.19 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..
Hul
Follow us

|

Updated on: Apr 28, 2022 | 8:00 AM

FMCG రంగ దిగ్గజం HUL తన మార్చి త్రైమాసిక ఫలితాలను ( Q4 Result) విడుదల చేసింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్టాండ్‌లోన్ లాభం రూ. 2,327 కోట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 2,143 కోట్ల లాభంతో పోలిస్తే 8.58 శాతం ఎక్కువ. ET ప్రకారం, నిపుణుల అంచనాల కంటే ఈ సంఖ్య మెరుగ్గా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం లాభం రూ. 2,180 కోట్లుగా అంచనా వేశారు. దీనితో పాటు బోర్డు తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్ ప్రకటించింది. అదే సమయంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం 5.34 శాతం పెరిగి రూ.2,307 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయం ద్వారా కంపెనీ ఆదాయం 10.4 శాతం పెరిగి రూ.13,190 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.11,947 కోట్లుగా ఉంది.

మార్కెట్ వృద్ధి కంటే ముందున్నప్పటికీ వాల్యూమ్ వృద్ధి గత ఏడాది స్థాయిలోనే ఉందని హెచ్‌యుఎల్ పేర్కొంది. అదే సమయంలో కంపెనీ విలువ, వాల్యూమ్ రెండింటి ఆధారంగా తన మార్కెట్ వాటాను నిరంతరం పెంచుతోంది. కమోడిటీ ధరలు బాగా పెరిగినప్పటికీ, ఈ త్రైమాసికంలో EBITDA మార్జిన్లు 24.6 శాతంగా ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య కంపెనీ నిరంతరం పొదుపుపై​దృష్టి సారిస్తు్న్నామని కంపెనీ తెలిపింది. తమ హోమ్ కేర్ విభాగంలో 24 శాతం, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగంలో 4 శాతం, ఫుడ్ అండ్ రిఫ్రెష్‌మెంట్ 5 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకారం, త్రైమాసికంలో, ఫ్యాబ్రిక్ వాష్, గృహ సంరక్షణ, పానీయాలు, ఆహారాలు, ఐస్ క్రీమ్ సెగ్మెంట్ బాగానే ఉంది.

ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో పెద్ద ఆందోళన కలిగిస్తుందని HUL MD, CEO సంజీవ్ మెహతా అన్నారు. ఇది మార్కెట్ వృద్ధిని తగ్గిస్తుందని చెప్పారు. దేశీయ ఆహార ధాన్యాల ఉత్పత్తి, రుతుపవనాల సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ముగుస్తుందని అంచనా వేసినట్లయితే మధ్యకాలంలో ధరల తగ్గుదల అవకాశాలు పెరుగుతాయన్నారు.

Read Also.. LIC IPO: వచ్చే వారమే ఎల్‌ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు రూ.60, ఉద్యోగులు రూ.45 సబ్సిడీ..

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!