AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whats App: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అమలులోకి మరో కొత్త ఫీచర్..

కొవిడ్‌ పుణ్యమా అని దేశంలో డిజిటల్‌ లావాదేవీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.  నగదుకు బదులు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం లతోనే చెల్లింపులు చేస్తున్నారు.

Whats App: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అమలులోకి మరో కొత్త ఫీచర్..
Whatsapp Payments
Basha Shek
|

Updated on: Apr 28, 2022 | 7:41 AM

Share

కొవిడ్‌ పుణ్యమా అని దేశంలో డిజిటల్‌ లావాదేవీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.  నగదుకు బదులు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం లతోనే చెల్లింపులు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే వినియోగదారులను ఆకట్టుకోవడానికి పేమెంట్ సంస్థలు రివార్డులు, కూపన్లు అంటూ సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే  ఈ సంస్థలకు  పోటీగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్‌ (Whats App) కూడా డిజిటల్‌ పేమెంట్స్‌లోకి అడుగుపెట్టింది.  అయితే ఫోన్‌ పే, గూగుల్‌పే, పేటీఎం కంపెనీల తరహాలో వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది.  అయితే యూజర్లను విస్తరించుకోవడంలో భాగంగా  ఇటీవలే 10 కోట్ల మంది వరకు పేమెంట్‌ సేవలను విస్తరించేందుకు నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి అనుమతులు పొందింది. ఈక్రమంలో క్యాష్‌బ్యాక్‌ (CashBack) ఆఫర్లతో కస్టమర్లకు చేరువయ్యేందుకు సిద్ధమైంది వాట్సాప్‌.  ఇందులో భాగంగా  మే చివరి నాటికి వాట్సాప్‌లో క్యాష్‌బ్యాక్‌ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఒక్కో వినియోగదారునికి రూ.33 చొప్పున క్యాష్‌బ్యాక్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా మూడు లావాదేవీలకు గానూ ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. అదేవిధంగా రిలయన్స్‌ జియో రీఛార్జి, హైవే టోల్స్, యుటిలిటీ బిల్లులు వంటివి చెల్లించే వారికి కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉంచాలని వాట్సాప్‌ యాజమాన్యం భావిస్తోంది.

వీటికి పోటీగా..

కాగా మన దేశంలో పేమెంట్స్‌ విభాగంలో అమెరికా వాల్‌మార్ట్‌కు సంస్థకు చెందిన ఫోన్‌పే కంపెనీదే హవా. అలాగే ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌ పే, యాంట్‌ గ్రూప్‌ మద్దతు ఉన్న పేటీఎం సంస్థలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే వాట్సప్‌ పేమెంట్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చి చాలా రోజులైనప్పటికీ వినియోగదారులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈక్రమంలోనే పేమెంట్స్ వినియోగదారుల సంఖ్య పరిమితిని 10 కోట్లకు పెంచుకునేందుకు ఎన్‌పీసీఐ నుంచి అనుమతి తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం భారత్‌లో వాట్సాప్‌కు 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికీ వాట్సాప్‌ నిత్యజీవితంలో భాగమైపోయింది. ఈ క్రమంలోనే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లతో మరింతమంది వినియోగదారులను పెంచుకునే పనిలో ఉంది. మరోవైపు వాట్సప్‌ పేమెంట్స్‌కు వినియోగదారులు అలవాటు పడితే కేవలం పేమెంట్స్‌ సేవలు అందించే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం కంపెనీలకు మాత్రం కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

PM Kisan: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకి హెచ్చరిక.. ఆ పనిచేస్తే వెంటనే అధికారులని కలవండి..!

3 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 150పైగా స్ట్రైక్‌రేట్‌.. తుఫాన్ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్ ఈ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్.. ఎవరంటే?

3 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 150పైగా స్ట్రైక్‌రేట్‌.. తుఫాన్ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్ ఈ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్.. ఎవరంటే?