Vivo: వచ్చే నెలలో వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. Vivo T1 ప్రో, Vivo T1 44W పేరుతో విడుదల..

Vivo వచ్చే నెలలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది. మే 4న దేశంలో Vivo T1 ప్రో, Vivo T1 44Wలను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది...

Vivo: వచ్చే నెలలో వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. Vivo T1 ప్రో, Vivo T1 44W పేరుతో విడుదల..
Vivo
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 28, 2022 | 7:30 AM

Vivo వచ్చే నెలలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది. మే 4న దేశంలో Vivo T1 ప్రో, Vivo T1 44Wలను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ప్రారంభించిన Vivo T1 5Gలో కొత్త T1 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లోని Vivo T1 ప్రో, Vivo T1 44Wలను విడుదల చేయనుంది. Vivo T1 Pro FHD+ AMOLED డిస్ప్లేతో రానుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుందని తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 778G చిప్‌సెట్‌తో అందిస్తారని భావిస్తున్నారు.Vivo T1 ప్రో గరిష్టంగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు 64MP మెయిన్‌ కెమెరా ఉండే అవకాశం ఉంది.

మరోవైపు, Vivo T1 44W 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ప్రారంభించిన Vivo T1 5G యొక్క టోన్డ్ డౌన్ వెర్షన్ అని చెబుతున్నారు. Vivo T1 44W Qualcomm Snapdragon 685 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఇటీవల, Vivo తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను – Vivo X80, X80 Proని చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 6.78-అంగుళాల 120Hz కర్వ్డ్ E5 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్‌ చేస్తు్న్నాయి. Vivo X80 Pro Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో ఇవి పని చేస్తాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి.

Read Also.. LIC IPO: వచ్చే వారమే ఎల్‌ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు రూ.60, ఉద్యోగులు రూ.45 సబ్సిడీ..