3 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 150పైగా స్ట్రైక్‌రేట్‌.. తుఫాన్ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్ ఈ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్.. ఎవరంటే?

క్రికెట్‌లో తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడే బ్యాట్స్‌మెన్స్ చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ రూటే సపరేటు. జట్టుకు అవసరమైనప్పుడే కాదు.. సాధారణంగానే అన్ని సమయాల్లో బ్యాటింగ్‌లో దంచి కొడుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

3 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 150పైగా స్ట్రైక్‌రేట్‌.. తుఫాన్ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్ ఈ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్.. ఎవరంటే?
Ipl 2022 Sunrisers Hyderabad Abhishek Sharma
Follow us

|

Updated on: Apr 28, 2022 | 6:10 AM

క్రికెట్‌లో తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడే బ్యాట్స్‌మెన్స్ చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ రూటే సపరేటు. జట్టుకు అవసరమైనప్పుడే కాదు.. సాధారణంగానే అన్ని సమయాల్లో బ్యాటింగ్‌లో దంచి కొడుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వాంఖడే పిచ్‌పై కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. IPL 2022(IPL 2022) 40వ మ్యాచ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్ పేరు అభిషేక్ శర్మ (Abhishek Sharma). ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐపీఎల్ 15వ సీజన్‌లో తన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రన్ మెషీన్‌గా మారాడు. ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తూ, తన సత్తా చాటుతున్నాడు. దాని ఫలితంగా తన జట్టులో మాత్రమే కాకుండా IPL 2022 రన్నర్స్‌లో కూడా తన పేరును లిఖించుకున్నాడు. అయితే, మ్యాచ్ ఫలితం మాత్రం గుజరాత్‌కు అనుకూలంగా మారింది. దీంతో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పూర్తిగా కనుమరుగైంది. ఈ మ్యాచ్‌లో 196 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి, అద్భుత విజయాన్ని అందుకుంది.

గుజరాత్ టైటాన్స్‌పై ఆరంభంలోనే కేన్ విలియమ్సన్ వికెట్ పడినప్పుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ కీలకంగా మారింది. ఆ ఇన్నింగ్స్ జట్టు స్కోరు బోర్డులో భారీ పరుగులు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగలిగిది. ఇందులో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఎంతో ముఖ్యమైనది.

9 బంతుల్లో 42 పరుగులు..

హైదరాబాద్ తరపున 21 ఏళ్ల ఎడమచేతి వాటం ఓపెనర్ అభిషేక్ శర్మ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను కేవలం 33 బంతుల్లో అది కూడా రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో అభిషేక్ 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అంటే 65 పరుగుల్లో కేవలం 9 బంతుల్లోనే బౌండరీల ద్వారా 42 పరుగులు సాధించాడు.

ఐపీఎల్ 2022లో అభిషేక్ శర్మ రెండో అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో, అతను మూడో వికెట్‌కు ఐడాన్ మార్క్‌రామ్‌తో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఇది జట్టుకు విజయవంతమైన, కీలకమైన భాగస్వామ్యంగా మారింది. ఎందుకంటే దీని తర్వాత సన్‌రైజర్స్ స్కోరు బోర్డులో భారీ స్కోర్ చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్ మెషిన్..

గుజరాత్ టైటాన్స్‌పై 65 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తరువాత, అభిషేక్ శర్మ IPL 2022లో టాప్ 5 రన్నర్స్‌లో ఒకడిగా మారాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 5వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ 8 మ్యాచ్‌లు ఆడి, 8 ఇన్నింగ్స్‌ల్లో 285 పరుగులు చేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: GT vs SRH IPL 2022 Match Result: హైదరాబాద్‌ కొంపముంచిన మాజీ ప్లేయర్.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్‌దే విజయం..

GT vs SRH Live Score: మరోసారి అదరగొట్టిన హైదరాబాద్‌.. గుజరాత్‌ టార్గెట్‌ ఎంతంటే..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?