Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ప్రజలు బంగారం, వెండిని ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసా!..

Akshaya Tritiya 2022: ఈ ఏడాది మే 3న అక్షయ తృతీయను భారతదేశం(Bharath) అంతటా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్‌లో ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు చాలా మంది..

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ప్రజలు బంగారం, వెండిని ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసా!..
Akshaya Tritiya 2022
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2022 | 9:25 PM

Akshaya Tritiya 2022: ఈ ఏడాది మే 3న అక్షయ తృతీయను భారతదేశం(Bharath) అంతటా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్‌లో ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు చాలా మంది తమ కొత్త వ్యాపారాలు లేదా  శుభకార్యాలు పనులను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలోని(Vaisakha Maasam) శుక్ల పక్ష తృతీయ రోజున వచ్చే అక్షయ తృతీయ నాడు ఎక్కువ మంది బంగారం , వెండి వస్తువుల కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈరోజు బంగారం కొనుగోలు చేయడం ద్వారా  లక్ష్మీ దేవిని స్వాగతిస్తారు. అక్షయ తృతీయ రోజున ఏది కొంటే అది ఎప్పటికీ తమతోనే ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అక్షయ తృతీయ సమీపిస్తున్నందున, ఈ పవిత్రమైన రోజున ప్రజలు బంగారం మరియు వెండిని ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసుకుందాం..

రావణుడి లంకా నగరాన్ని ఆక్రమించడానికి ముందు కుబేరుడు లంకా నగరాన్ని పాలించాడని పురాణాల కథనం. కుబేరుడు..  శివుడు , బ్రహ్మదేవుని దీవెనలు పొందేందుకు తపస్సు చేశాడు. అనేక వరాలను పొందాడు. అల్కాపురి నగరాన్ని దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మ..  కుబేరుడి కోసం కైలాస పర్వతం దగ్గర నిర్మించాడు . అక్షయ తృతీయ నాడు కుబేరునికి స్వర్గ సంపద సంరక్షకుని పాత్ర లభించిందని చెబుతారు. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొని, కుబేరుని పూజించడం వల్ల తమ కుటుంబానికి ఐశ్వర్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం.

 మహాభారతంలోని మరో కథనం అక్షయ తృతీయకు బంగారానికి గల సంబంధాన్ని తెలుపుతుంది. 

పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒకసారి వారిని సందర్శించాడు. అతని పర్యటనలో, ద్రౌపది అతనికి విందు సిద్ధం చేయలేక సిగ్గుపడింది. శ్రీకృష్ణుడు వంటపాత్రకు అంటుకున్న చిన్న అటుకుని ఆహారంగా స్వీకరించి, పాండవులకు తనపై ఉన్న ప్రేమ తన ఆకలిని తీరుస్తుందని చెప్పాడు. అంతేకాదు పాండవులకు అక్షయపాత్రని వరం కూడా ఇచ్చాడు. పాండవులు అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు ఈ అక్షయ పాత్ర అంతులేని ఆహారాన్ని అందించింది. ఆ విధంగా, అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం వల్ల తమ కుటుంబానికి అపరిమితమైన సౌభాగ్యం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు.

కొన్ని ఇతిహాసాలు విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముని జన్మకు అక్షయ తృతీయ కు సంబంధం ఉందని పేర్కొన్నాయి.

ఈ ఏడాది ముహూర్తం :

ఈ సంవత్సరం, అక్షయ తృతీయ ముహూర్తం మే 3 ఉదయం 5:39 గంటలకు ప్రారంభమై మే 4 ఉదయం 5:38 వరకు కొనసాగుతుంది.

Also Read: Viral News: చికెన్ ముక్కలు తక్కువ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు.. ఆ తరువాత ట్విస్ట్ అదిరిపోయింది..!

హిందూ మతం వైపు ఆకర్షితులవుతున్న హాలీవుడ్ సెలబ్రెటీలు (web story)