Viral News: చికెన్ ముక్కలు తక్కువ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు.. ఆ తరువాత ట్విస్ట్ అదిరిపోయింది..!

Viral News: ప్రస్తుత కాలంలో కొంతమంది జనాలు మరీ క్రేజీగా ఉంటున్నారు. ఎంత క్రేజీ అంటే.. చిన్న చిన్న విషయాలకే రచ్చ రచ్చ ..

Viral News: చికెన్ ముక్కలు తక్కువ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు.. ఆ తరువాత ట్విస్ట్ అదిరిపోయింది..!
Chicken
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 27, 2022 | 9:05 PM

Viral News: ప్రస్తుత కాలంలో కొంతమంది జనాలు మరీ క్రేజీగా ఉంటున్నారు. ఎంత క్రేజీ అంటే.. చిన్న చిన్న విషయాలకే రచ్చ రచ్చ చేసేస్తున్నారు. అవును.. తాజాగా ఓ మహిళ తన ఆర్డర్‌లో చికెన్ ముక్కలు తక్కువగా వచ్చాయని ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది. ఈ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యకరమైన ఫుడ్ కంటే.. ఫ్రైడ్ ఫుడ్‌ తినేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడిపోయారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఒక్క ఫోన్ కాల్, ఒక్క బుకింగ్‌తో మనకు కావాల్సింది మన చేతికి వస్తుంది. అయితే, కొన్నిసార్లు హడావుడిలో పొరపాట్లు జరుగుతుంటాయి. దాన్ని కూడా కొందరు రచ్చ రచ్చ చేస్తారు. తాజాగా ఆలాంటి ఉదంతమే అమెరికాలో వెలుగు చూసింది. చేసిన ఆర్డర్ కంటే తక్కువ రావడంతో.. ఆగ్రహించిన మహిళ ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని క్లీవ్ ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ ఇచ్చింది. డెలివరీ బాయ్.. ఆర్డర్ తీసుకువచ్చి ఇచ్చారు. అయితే, ఆ ఆర్డర్‌లో చికెన్ పీసెస్ తక్కువగా పడ్డాయట. దాంతో ఆగ్రహానికి గురైన సదరు మహిళ.. నేరుగా పోలీస్ కంప్లైట్ నెంబర్ 911 కి కాల్ చేసింది. ఫాస్ట్ చైన్ కేఎఫ్‌సీ పై ఫిర్యాదు చేసింది. కేఎఫ్‌సీకి తాను 8 చికెన్ పీసెస్ కోసం ఆర్డర్ చేస్తే.. కేవలం 4 పీసెస్ మాత్రమే వచ్చాయంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

అయితే, మహిళ వాదనను విన్న పోలీసులు.. ఆ తరువాత చేతులెత్తేశారు. ఆమె ఫిర్యాదపై సహాయం చేయలేమంటూ బదులిచ్చారట అక్కడి పోలీసులు. ఇది సివిల్ విషయం అని, క్రిమినల్ విషయం కాదని వివరించారట. ఈ కేసులో రెస్టారెంట్ మాత్రమే మీకు సహాయం చేస్తుందని సదరు మహిళకు పోలీసు అధికారులు సూచించారట. అలాగే, ఇలాంటి చిల్లర కాల్స్ చేసి సమయాన్ని వృథా చేయొద్దని మహిళకు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

Also read:

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ వెరీ స్పెషల్.. మీరు రొమాంటిక్ ఆ? సింగిల్ ఆ? చెప్పేస్తుంది..!

Viral News: బాత్రూమ్ గోడలో వింత వస్తువు.. ఓపెన్ చేసి చూడగా షాక్..!

Viral News: బాత్రూమ్ గోడలో వింత వస్తువు.. ఓపెన్ చేసి చూడగా షాక్..!