Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా.. మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన కుర్రాడే..

వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా మొట్టమొదటి సారి ఓ భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా ఎన్నికవ్వడంపై పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా.. మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన కుర్రాడే..
Ajay Banga
Follow us

|

Updated on: May 04, 2023 | 12:16 PM

వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా మొట్టమొదటి సారి ఓ భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా ఎన్నికవ్వడంపై పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా బంగాను ఎన్నుకున్నట్లు.. 25 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ప్రకటించింది. ముందుగా ప్రపంచ బ్యాంకు బోర్డు అజయ్ బంగాను నాలుగు గంటలపాటు సుధీర్ఘంగా ఇంటర్వ్యూ చేసింది. అనంతరం, 63 ఏళ్ల అజయ్ బంగాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. బంగా సారథ్యంలో పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్‌ లక్ష్యాలను ఆయన నెరవేరుస్తారని ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆశాభావం వ్యక్తంచేసింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా ఉన్న డేవిడ్ మాల్పాస్ జూన్ 1 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. జూన్‌ 2 నుంచి అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బంగా ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. బంగా ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. కాగా, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుభాకాంక్షలు చెప్పారు.

వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అజయ్ బంగా గురించి ఆసక్తికర విషయాలు..

  • అజయ్‌పాల్ సింగ్ బంగా నవంబర్ 10, 1959న పూణేలో జన్మించారు.
  • సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత దేశ రాజధానిలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఎకనామిక్స్ చదివారు. తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-A)లో MBA పూర్తి చేశారు.
  • బంగా 1981లో నెస్లేతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 13 సంవత్సరాల పాటు కంపెనీ సేల్స్, మార్కెటింగ్, జనరల్ మేనేజ్‌మెంట్ విభాగాలలో పని చేసారు.
  • నెస్లే తరువాత, ఆయన పెప్సికోలో చేరారు. 1991 సంస్కరణల తర్వాత భారతదేశంలో ఫాస్ట్-ఫుడ్ ఫ్రాంచైజీలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
  • 2010లో, బంగా మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా పనిచేశారు. దీనికి ముందు, అతను సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) గా ఉన్నారు.
  • 2016లో, వాణిజ్యం, పరిశ్రమల రంగంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతో బంగాను సత్కరించింది. అతను 2012లో ఫారిన్ పాలసీ అసోసియేషన్ మెడల్‌ను కూడా పొందారు. బంగా 2019లో ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్, బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాండింగ్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును, 2021లో సింగపూర్ పబ్లిక్ సర్వీస్ స్టార్ విశిష్ట పురస్కారాలను అందుకున్నారు.
  • డిసెంబర్ 2021లో, బంగా మాస్టర్‌కార్డ్ CEO పదవి నుంచి పదవీ విరమణ చేసారు.. జనవరి 2022లో జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
  • అజయ్ బంగా త్రైపాక్షిక కమిషన్ సభ్యుడు, US-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ వ్యవస్థాపక ధర్మకర్త, యునైటెడ్ స్టేట్స్-చైనా సంబంధాలపై జాతీయ కమిటీ మాజీ సభ్యుడు, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ ఎమిరిటస్ గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..