AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UAEలోని ఐకానిక్ ప్రదేశాల్లో యోగా దినోత్సవం! భారతీయ మహిళా వైద్యుల స్పెషల్‌

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యూఏఈలోని భారతీయ మహిళా వైద్యులు డాక్టర్ సౌజన్య నాయకత్వంలో అనేక ప్రముఖ ప్రదేశాలలో యోగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ఎమిరేట్స్ నుండి వైద్యులు పాల్గొని నిర్వహించారు.

UAEలోని ఐకానిక్ ప్రదేశాల్లో యోగా దినోత్సవం! భారతీయ మహిళా వైద్యుల స్పెషల్‌
ఒత్తిడి ఇప్పుడు కొత్త విషయం కాదు. ఇది మన దినచర్యలో ఒక భాగంగా మారింది. మానసిక ఒత్తిడి తగ్గకపోతే సమస్య పెరుగుతుంది. నిరాశ రూపంలోకి మారుతుంది. దీని నుంచి బయటపడటానికి, మందులు తీసుకునే బదులు.. యోగా సహాయం తీసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల్లో కోట్లాది మంది యోగా చేయడం ద్వారా రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందారు. ఇది సహజంగా ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. కనుక ఒత్తిడిని తగ్గించగల యోగాసనాల గురించి నిపుణుల అభిప్రాయం తెలుసుకుందాం..
SN Pasha
|

Updated on: Jun 23, 2025 | 11:06 AM

Share

జూన్‌ 21.. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు అన్ని దేశాల్లో కూడా యోగా అవగాహన కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించారు. యూఏఈలో కూడా ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగాను ఘనంగా నిర్వహించారు. ఆ దేశంలో భారతీయ మహిళా వైద్యులు అనేక ఐకానిక్ ప్రదేశాల్లో యోగా సెషన్లను నిర్వహించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చొరవను డాక్టర్ సౌజన్య నాయకత్వం వహించారు. దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వివిధ ఎమిరేట్స్ నుండి వచ్చిన భారతీయ మహిళా వైద్యులు పాల్గొన్నారు. వారు ఆరోగ్యం, సామరస్యం స్ఫూర్తితో ఐక్యమయ్యారు. వీరంతా భారతీయ సాంప్రదాయ చీరకట్టులో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం మరింత అందాన్ని ఇచ్చింది. భారతీయ వారసత్వాన్ని అందంగా ఆవిష్కరిస్తూ.. అంతా కలిసి యోగాసనాలు వేస్తూ.. యోగాపై అందరికీ అవగాహన కల్పించారు. ఈ ఉత్సాహభరితమైన యోగా సెషన్‌లు సమగ్ర ఆరోగ్యం, ప్రాముఖ్యతను తెలియజేశాయి.

ప్రతి రోజు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మహిళా డాక్టర్లు వివరించారు. మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని, తక్కువ ఒత్తిడి, జన్యు వ్యక్తీకరణను మారుస్తుందని అన్నారు. అలాగే రక్తపోటును కంట్రోల్‌ ఉంచుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది, దీర్ఘకాలిక వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది, సమతుల్య భావాన్ని మెరుగుపరుస్తుంది, ఎముకలు బలపడేలా చేస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి