Twitter: పాకిస్తాన్ కు షాక్.. భారత్ లో అధికారిక ట్విట్టర్ ఖాతా బ్లాక్.. ఎందుకంటే..

పాకిస్తాన్ కు భారత్ లో బిగ్ షాక్ తగిలింది. ఈ షాక్ కు గల పూర్తి కారణాలు తెలియకపోయినప్పటికి లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతాను

Twitter: పాకిస్తాన్ కు షాక్.. భారత్ లో అధికారిక ట్విట్టర్ ఖాతా బ్లాక్.. ఎందుకంటే..
Govt Of Pakistan Twitter Account
Follow us

|

Updated on: Oct 01, 2022 | 8:28 PM

పాకిస్తాన్ కు భారత్ లో బిగ్ షాక్ తగిలింది. ఈ షాక్ కు గల పూర్తి కారణాలు తెలియకపోయినప్పటికి లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతాను భారత్ లో నిలిపివేసింది. దీంతో అక్టోబర్ 1వ తేదీ శనివారం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ ఖాతాను భారత్ లో బ్లాక్ చేసింది. అంటే భారత్ లో నివసిస్తూ ట్విట్టర్ ఖాతా ఉన్నవారు ట్విట్టర్ లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లో ఎటువంటి సమాచారాన్ని చూడటానికి అవకాశం ఉండదు. ట్విట్టర్ లో గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని సెర్చ్ చేస్తే అకౌంట్ విట్ హెల్త్ లో ఉన్నట్లు డిస్ ప్లే అవుతోంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అకౌంట్ భారత్ లో విత్ హెల్త్ లో పెట్టామని లీగల్ డిమాండ్ కారణంగా అనే సందేశం కూడా కనిపిస్తోంది. సాధారణంగా అయితే ఎవరివైనా ట్విట్టర్ ఖాతాను న్యాయస్థానం ఆదేశాల మేరకు మాత్రమే ట్విట్టర్ సంస్థ బ్లాక్ చేస్తుంది. లేదా ఏదైనా విధ్వంసాలు సృష్టించేందుకు లేదా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే సందేశాలు ఏవైనా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అటువంటి ఖాతాలపై కూడా ట్విట్టర్ చర్యలు తీసుకుంటోంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ను సడన్ గా ఎందుకు బ్లాక్ చేశారనే దానిపై మాత్రం స్పష్టత రావల్సి ఉంది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పీఎఫ్ఐ ) పై భారతదేశంలో నిషేధం విధిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ కూడా విడుదల చేసింది. ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పీఎఫ్ఐ అనే సంస్థ పనిచేస్తుందనే ఆరోపణల నేపథ్యానికి తోడు, ఎన్ ఐఎ దాడుల సందర్భంగా వెలుగుచూసిన అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్రప్రభుత్వం పీఎఫ్ఐ పై నిషేధం విధించింది. దీంతో ఆ సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను ట్విట్టర్ సంస్థ బ్లాక్ చేసింది. అయితే ఇదే సమయంలో సడన్ గా పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబధించిన అధికారిక ట్విట్టర్ ఖాతాను చేయడం చర్చనీయాంశమైంది. అయితే పీఎఫ్ ఐపై భారత ప్రభుత్వ నిషేధాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ అధికారులు చాలామంది బహిరంగంగానూ ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పాకిస్తాన్ ట్విట్టర్ ఖాతాను భారత్ లో బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ కు చెందిన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయడం, తిరిగి పునరుద్దరించడం ఇదే మొదటి సారి అయితే కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (ఐటీ చట్టం) 2000 కింద చాలా వరకు పాకిస్తాన్ కు చెందిన రాయబార కార్యాలయాలు, జర్నలిస్టులతో పాటు కొంతమంది ప్రముఖుల అకౌంట్లను నిషేధించిందని పాకిస్తాన్ మీడియా గతంలో పలు కథనాలను ప్రచురించింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో పాటు, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్ లలోనూ పాకిస్తాన్ రాయబార కార్యాలయం ట్విట్టర్ అకౌంట్లను భారత్ బ్లాక్ నిషేధించింది. దీనికి సంబంధించి అప్పట్లో అనేక కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత కొన్ని ఖాతాలను పునరుద్ధరించింది. మరోవైపు 8 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానెల్స్ ను, ఒక ఫేస్ బుక్ అకౌంట్ ను ఇటీవల భారత్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో పాకిస్తాన్ కు చెందిన ఒక యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానెల్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

భారత వ్యతిరేక కంటెంట్ పోస్ట్ చేసినందుకుగానూ 100 యూట్యూబ్ ఛానెల్స్, నాలుగు ఫేస్ బుక్ పేజీలు, ఐదు ట్విట్టర్ ఖాతాలతో పాటు మరో మూడు ఇన్ స్టాగ్రామ్ అకౌంటర్లను బ్లాక్ చేసింది. అయితే భారత్ కు వ్యతిరేకంగా అసత్య ప్రచారాలను చేయడానికి సామాజిక మాద్యమాలను వినియోగిస్తుండటంతో ఇలాంటి ఘటనలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కంటెంట్ పోస్టు చేస్తున్నారో గుర్తించి అలాంటి వారిపై చర్యలు చేపడుతోంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాను ఎందుకు బ్లాక్ చేసిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!