- Telugu News World Global indians This girl sang the song teri mitti in america manoj muntashir said you are proud
Viral Video: ‘తేరి మిట్టి మే మిల్ జవాన్’ అంటూ అదరగొట్టిన అమ్మాయి.. వైరల్ అయిన వీడియో..
కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి...

Updated on: Dec 24, 2021 | 7:24 PM
కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. తాజాగా అమెరికాలో ఓ అమ్మాయి ‘తేరి మిట్టి మే మిల్ జవాన్’ అంటూ పాట పాడి భారత జెండాను ఎగురవేసింది. ఈ అమ్మాయి స్వరం ఎంత మధురంగాఉంటుందంటే గీత రచయిత మనోజ్ ముంతాషిర్ కూడా గొప్పగా చెప్పుకోకుండా ఉండలేకపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వైరల్ అయిన వీడియోలో అమ్మాయి మధురమైన స్వరంలో పాట పాడుతున్నట్లు చూడవచ్చు. పాట పాడటంతో పాటు త్రివర్ణ పతాకాన్ని కూడా చేతిలో పట్టుకుంది. పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ వీడియోను గీతా బెన్ రబారి తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టింది. ఈ వీడియోను లక్షా 20 వేల మందికి పైగా చూశారు. అదే సమయంలో ఈ పాటపై వందలాది మంది తమ కామెంట్స్ చేశారు.
Read Also.. Hit.Movie: తెలుగు ఎన్ఆర్ఐ ఓటీటీ ప్లాట్‌ఫారమ్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా సినిమాలు చూడొచ్చటా..!