విదేశాల్లో సెటిల్ అయిన పెళ్లికాని ప్రసాదులకు బ్యాడ్ న్యూస్: మ్యాట్రిమోనీ ట్రెండ్స్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు
Online Matrimony Trends 2021: 15 శాతం మంది మహిళలు NRI మ్యాచ్‌లతో బాగానే ఉండగా, కేవలం 5 శాతం మంది పురుషులు మాత్రమే NRI భాగస్వామి పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు భారత్‌మ్యాట్రిమోనీ చేపట్టిన ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ ట్రెండ్స్ రిపోర్ట్ 2021లో వెల్లడైంది.
Online Matrimony Trends 2021: మీరు విదేశాల్లో జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యరా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఎన్నారై వధువులకు డిమాండ్ బాగా తగ్గిందని, మహిళలు సెల్ఫ్ డెషిషన్‌తోనే తన జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఆన్‌లైన్ పెళ్లిసంబంధాలు చూసే ప్లాట్‌ఫారమ్ భారత్‌మ్యాట్రిమోనీ తన వార్షిక ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ ట్రెండ్స్ రిపోర్ట్ 2021లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం, దాదాపు 4 మిలియన్ సింగిల్స్‌లో 70 శాతం కంటే ఎక్కువ మంది స్వయంగా ఇలాంటి వెబ్‌సైట్లలో నమోదు చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే స్వయంగానే తమ జీవిత భాగస్వామి కోసం సెర్చ్ చేసి నిర్ణయంతీసుకుంటున్నట్లు వెల్లడైంది.
“సింగిల్స్ రిజిస్ట్రేషన్ పరంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పూణే నగరాలు అగ్రస్థానంలో ఉండగా, విదేశాల్లో ఉన్న భారతీయుల పరంగా అమెరికా, కెనడా, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్‌లు రిజిస్ట్రేషన్లలో అగ్రస్థానంలో ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది.
“గత కొన్ని సంవత్సరాలుగా, మహిళలు ఎక్కువగా వివాహ నిర్ణయాన్ని తమకు అనుకూలంగానే ఎంచుకుంటున్నారు. కోవిడ్-తొలి దశ కంటే 30 శాతం ఎక్కువగా ఉందని” తెలిపింది. ఆన్‌లైన్‌లోనే మహిళల నిశ్చితార్థాలు 60 శాతం పెరిగినట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది. ప్రభుత్వ ID (పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ మొదలైనవి)తో ధృవీకరించిన మహిళా ప్రొఫైల్‌లకు పురుషుల నుంచి 37 శాతం డిమాండ్ వచ్చిందని, ఐడీలతో ప్రొఫైల్ కన్‌ఫాం చేయని ప్రొఫైల్స్‌కు 34 శాతం స్పందన వచ్చిందని రిపోర్ట్ తెలిపింది.
యూజర్లు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు చాలా యాక్టివ్‌గా ఉంటారని, 76 శాతం మంది పురుషులు, 80 శాతం మంది మహిళలు భారతదేశంలో లేదా విదేశాలలో స్థిరపడిన జీవిత భాగస్వామిని కనుగొనడంలో ఎక్కువ ఆసక్తి చూపించినట్లు తేలింది. NRI మ్యాచ్‌లతో 15 శాతం మంది మహిళలు బాగానే ఉండగా, కేవలం 5 శాతం మంది పురుషులు మాత్రమే NRI భాగస్వామి పట్ల ఆసక్తి చూపారు. చదువుల పరంగా, B Tech, BE, MBA, బ్యాచిలర్స్ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌లో డిగ్రీలు చేసిన వారికి అధికంగా స్పందన వస్తున్నట్లు తేలింది.
NRI Investments: ప్రవాస భారతీయులు 2022 సంవత్సరంలో పెట్టుబడులు ఎలా పెట్టాలి? నిపుణులు ఏమంటున్నారంటే..