AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TANA Conference 2025: కనీవినీ ఎరుగని రీతిలో తానా సభలు.. మొదటి కిక్ ఆఫ్-ఫండ్ రైజర్‌‌లో ఎంత సేకరించారో తెలుసా..?

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 24వ కన్వెన్షన్‌ డెట్రాయిట్‌ వేదికగా జరగనుంది. 2025 జులై 3,4,5 తేదీల్లో మూడ్రోజులపాటు తానా సభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు. తానా సభల కోసం మొదటి కిక్ ఆఫ్-ఫండ్ రైజర్‌ కార్యక్రమం నిర్వహించారు.

TANA Conference 2025: కనీవినీ ఎరుగని రీతిలో తానా సభలు.. మొదటి కిక్ ఆఫ్-ఫండ్ రైజర్‌‌లో ఎంత సేకరించారో తెలుసా..?
TANA Conference 2025
Shaik Madar Saheb
|

Updated on: Oct 20, 2024 | 4:17 PM

Share

అమెరికాలో 24వ తానా సభలకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. డెట్రాయిట్‌ వేదికగా 2025 జులైలో తానా కన్వెన్షన్‌ జరగనుంది. జులై 3,4,5 తేదీల్లో మూడ్రోజులపాటు తానా సభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభల నిర్వహణ బాధ్యతలను ఎన్ఆర్ఐ ఉదయ్‌కుమార్‌ కు అప్పగించారు. 2005, 2015లోనూ డెట్రాయిట్‌లోనే తానా మహాసభలు నిర్వహించారు. ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా 2025 మహాసభలను సైతం డెట్రాయిట్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు.

డెట్రాయిట్ కాన్ఫరెన్స్ కోసం తానా సభ్యులు కిక్ ఆఫ్ – ఫండ్ రైజర్‌ను నిర్వహించారు. అయితే.. ఈ కిక్ ఆఫ్ పంఢ్‌ రైజర్‌కి భారీగా స్పందన లభించింది. తాము ఉహించని నెంబర్‌ని రీచ్‌ అయ్యామని తానా కన్వీనర్ ఉదయ్‌ తెలిపారు. ఈ నెంబర్ చూశాక తమపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. ఎప్పటికి గుర్తుండిపోయేలా ఈసారి తానా కన్వెన్షన్ నిర్వహించబోతున్నామని తానా కాన్ఫరెన్స్‌ డైరెక్టర్ సునీల్ పంత్ర చెప్పారు.

డెట్రాయిట్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఫండ్ రైజర్‌లో భాగంగా.. 3 మిలియన్లు సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా $50000 మొదటి చెక్కు కూడా అందిందన్నారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఫండ్ ను కలెక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ చాపలమడుగు (కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్), గంగాధర్ నాదెళ్ల (కాన్ఫరెన్స్ చైర్మన్) , సునీల్ పంత్రా (కాన్ఫరెన్స్ డైరెక్టర్) ఇతరులతో కలిసి టీవీ9తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

వీడియో చూడండి..

అలరించిన సాంస్కృతిక పోటీలు..

తానా కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఫండ్ రైజర్ లో భాగంగా.. USA అంతటా పలు నగరాల్లో తానా సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తోంది.. అందులో భాగంగా శనివారం డెట్రాయిట్ లో నిర్వహించారు. పాటలు, డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఫైనల్స్ నవంబర్ 02న రాలీలో జరుగుతాయి. డాక్టర్ ఉమా కాటికి (తానా సాంస్కృతిక సమన్వయకర్త) టీవీ9తో మాట్లాడుతూ ప్రతి నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. డెట్రాయిట్‌లో విజయవంతం చేసినందుకు ధన్యవాదాలంటూ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా నలుమూలల నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, తెలుగు ప్రజలు హాజరయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..