‘గూఢచారి పావురం’ పై కేసు పెట్టిన ఖాకీలు, పంజాబ్ పోలీసుల నిర్వాకం చూడాల్సిందే!

'గూఢచారి  పావురం' పై కేసు పెట్టిన ఖాకీలు, పంజాబ్ పోలీసుల నిర్వాకం చూడాల్సిందే!
Pigeon Caught Carrying Suspicious White Paper

మాకు అనుమానం వచ్చిందా ? మనుషులపైనే కాదు, జంతువులు, పక్షులపై కూడా కేసు పెట్టేస్తామంటున్నారు పంజాబ్ పోలీసులు.. అన్నట్టే చేశారు వాళ్ళు..

Umakanth Rao

| Edited By: Phani CH

Apr 21, 2021 | 2:28 PM

మాకు అనుమానం వచ్చిందా ? మనుషులపైనే కాదు, జంతువులు, పక్షులపై కూడా కేసు పెట్టేస్తామంటున్నారు పంజాబ్ పోలీసులు.. అన్నట్టే చేశారు వాళ్ళు.. అసలు విషయానికే వస్తే… పంజాబ్ లో పాకిస్తాన్ తో గల అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ మధ్య ఓ పావురమొకటి ఎగురుకుంటూ వచ్చింది.  ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న నీరజ్ కుమార్ అనే కానిస్టేబుల్ దాన్ని చూశాడు. దాని కాళ్లకు ఓ తెల్లని కాగితమొకటి  ఉండడం చూసి షాక్  తిన్నాడు.  దాన్ని పట్టుకోవడమే కాదు…  నలుపు, తెలుపు రంగులతో ఉన్న ఈ పావురాన్ని గురించిన సమాచారాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్ కి తెలియజేశాడు. ఓ అడ్ హెసివ్ టేపుతో ఈ పావురం కాళ్లకు తెల్ల కాగితం కట్టి ఉన్నట్టు ఇద్దరూ నిర్ధారించారు. ఇదేదో అనుమానాస్పదంగా ఉందని,  బహుశా ఇది గూడచార పావురమై ఉండవచ్చునని అమృత్ సర్ లోని పోలీసులు కూడా భావించారు. ఇంకేం ! ఆ పావురంపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. ఇంతకీ ఈ తెల్లకాగితంలో ఏముందో అన్న విషయం తెలియలేదు.

2020 లో కూడా ఇలాగే మే నెలలో జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లా వద్ద ఓ పావురాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. దాని కాళ్లకు ఏదో కోడ్ భాషలో సందేశం ఉండడంతో వెంటనే అధికారులకు ఆ పావురాన్ని అప్పగించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఈ పావురానికి గూఢచర్యంలో శిక్షణ ఇచ్చి ఉంటారని భావించారు.. ఆ తరువాత సీన్  కట్ .. చేస్తే. అది తన పెంపుడు  పావురమని, దాన్ని  అప్పగించాలని పాక్ వాసి ఒకడు అధికారులకు విన్నవించుకున్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: Vaccination Good News: కోవాక్సిన్ ఆ వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. శుభవార్త చెప్పిన ఐసీఎంఆర్

Telangana Municipolls: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధం.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu