E-Waste Threat: ప్రపంచం ముందుకు మరో పెను ముప్పు.. హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి.. కరో సంభవ్!

ప్రపంచం ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. అవును.. నిజమే ఒకవైపు కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఏడాదిన్నరగా అతలాకుతలం చేస్తున్న తరుణంలో మరో పెను ముప్పు ముంచుకొస్తున్న సంకేతాలు తాజాగా వెల్లడయ్యాయి.

E-Waste Threat: ప్రపంచం ముందుకు మరో పెను ముప్పు.. హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి.. కరో సంభవ్!
World
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 21, 2021 | 1:13 PM

E-Waste Threat to World: ప్రపంచం ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. అవును.. నిజమే ఒకవైపు కరోనా వైరస్ (CORONAVIRUS) యావత్ ప్రపంచాన్ని ఏడాదిన్నరగా అతలాకుతలం చేస్తున్న తరుణంలో మరో పెను ముప్పు ముంచుకొస్తున్న సంకేతాలు తాజాగా వెల్లడయ్యాయి. తాజాగా ముంచుకొస్తున్న ముప్పు మానవాళి తనకు తానుగా చేసుకుంటున్న పనుల ప్రతిఫలంగానే ఉత్పన్నమైంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థ పదార్థాలతో పోలిస్తే ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు (ELECTRONIC WASTAGE) ఇప్పుడు అత్యధికంగా వ్యర్థ ప్రవాహంగా మారుతున్నాయి. 2019లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పరిశీలిస్తే షాక్ తగిలే కఠోర సత్యాలు కనిపిస్తున్నాయి. ఒక్క ఏడాదిలో 50 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు బయటపడ్డాయి. ఈ గణాంకాల ఆధారంగా ప్రపంచ ఆర్థిక సంస్థ (WORLD ECONOMIC FORUM) ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్ (RECYCLING) చేయడం పెరగకపోతే భవిష్యత్తులో ఈ-వ్యర్థాలు మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తాయని పేర్కొంది.

ఇతర అన్ని వ్యర్థాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇప్పుడు ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఎక్కువ శాతం కంప్యూటర్లు (COMPUTERS), మొబైల్ ఫోన్లే (MOBILE PHONES) కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి (UNITED NATIONS ORGANISATION) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం చూస్తే 2019లో 50 మిలియన్ టన్నులకు పైగా ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు డంప్ అయ్యాయి. అంతకు ముందు అంటే 2018 సంవత్సరంలో ఎలక్ట్రానిక్ వ్యర్థ ప్రవాహం 48.5 మిలియన్ టన్నులు. ఈ గణాంకాలను ఐక్యరాజ్యసమితి వెల్లడించగా ప్రపంచ ఆర్థిక సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బయటపడుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల విలువ సుమారు 62.5 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అనేక దేశాల జీడీపీ (GDP) కంటే చాలా ఎక్కువ. ఎలక్ట్రానిక్స్‌ని రీసైకిల్ చేసేందుకు మెరుగైన పరిశ్రమలను స్థాపించ వలసిన అవసరం ఉందని ప్రపంచ ఆర్థిక సంస్థ అభిప్రాయపడింది. దీని ద్వారా నూతన వాణిజ్య, ఉపాధి అవకాశాలు ఏర్పడే వీలుంటుందని ప్రపంచ ఆర్థిక సంస్థ సూచిస్తోంది.

ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు పలు టెక్నాలజీ సంస్థలు గత నెలలో ఎలక్ట్రానిక్ వేస్టేజ్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రణాళికలను ప్రకటించాయి. 2030 సంవత్సరం నాటికి ఎలక్ట్రానిక్ వేస్టేజీని జీరో స్థాయికి తీసుకురావాలని గూగుల్ (GOOGLE), మైక్రోసాఫ్ట్ (MICROSOFT) కంపెనీలు ప్రతిపాదిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రవాణాపై కరో సంభవ్ (KARO SAMBHAV) పేరుతో ద్వారా ప్రణు సింఘాల్ (PRANU SINGHAL) కంపెనీ మన దేశంలో కృషి చేస్తోంది. తమ అజూర్ క్లౌడ్ (AZOOR CLOUD) సేవల ద్వారా వీరికి సమాచారాన్ని అందించడంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సహాయపడుతుంది. ప్రణు సింఘాల్ బృందం స్థాపించిన కరో సంభవ్ కార్యకలాపాలు మన దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. ఐదు వందలకు పైగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు 22,700 పాఠశాలలు, ఐదువేల అనధికారిక రంగాల అగ్రిగేటర్లు, ఎనిమిది వందల మరమ్మతు దుకాణాలతో కలిసి ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను రీసైక్లింగ్ చేసేందుకు సింఘాల్ బృందం ప్రయత్నం చేస్తోంది. కరో సంభవ్ స్టార్టప్ సంస్థ మనదేశంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ సమస్యను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తయారీదారులు, పంపిణీదారులు, రీసైక్లింగ్ సంస్థలు కలిసి ఈ-వేస్ట్‌ను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశం ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ దాదాపు 3.2 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇందులో ఎక్కువ భాగాన్ని రీసైకిల్ చేయడానికి కరో సంభవ్ సంస్థ ప్రయత్నం చేస్తోంది.

ఢిల్లీ ప్రభుత్వం (DELHI GOVERNMENT) ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు (ELECTRONIC WASTE MANAGEMENT PARK) ఏర్పాటుకు ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉపకరణాలు, ఈ-బ్యాటరీలను సురక్షితంగా, శాస్త్రీయంగా పారవేయడానికి ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు ఏర్పాటు చేస్తోంది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం. 2018 అధ్యయనం ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం 15 అనధికారిక హాట్ స్పాట్ లను ఏర్పాటు చేశారు ఇవి ఎటువంటి ఆరోగ్య, పర్యావరణ భద్రత లేకుండా పని చేయడం కొద్దిగా ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వేస్టేజీ నిర్వహణకు పలు కంపెనీలు పోరాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌ని రీసైక్లింగ్ చేస్తుంది కేవలం 20 శాతం మాత్రమే. మిగిలిన 80 శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భూమిపై అనేకచోట్ల వృధాగా పడివున్నాయి. దీని వల్ల పర్యావరణానికి హాని పొంచి ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో ఎలక్ట్రానిక్ వేస్టేజీని రీసైక్లింగ్ చేయడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే మనమే పర్యావరణానికి హాని చేసే వారిమి అవుతాం.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన