Australian female farmers: వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న అక్కడి మహిళా రైతులు.. ఇది ఎలా సాధ్యమైందంటే..

భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా మహిళలు కూడా వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. మగ రైతులలాగే మెరుగైన పని చేస్తున్నారు అక్కడి మహిళా రైతులు.

Australian female farmers: వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న అక్కడి మహిళా రైతులు.. ఇది ఎలా సాధ్యమైందంటే..
Australian Female Farmers
Follow us

|

Updated on: Nov 12, 2021 | 8:43 AM

Australian female farmers: భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా మహిళలు కూడా వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. మగ రైతులలాగే మెరుగైన పని చేస్తున్నారు అక్కడి మహిళా రైతులు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం.. ఆహారోత్పత్తికి మహిళలు ఎల్లప్పుడూ గణనీయమైన సహకారం అందిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళల ఉపాధిలో దాదాపు మూడోవంతు వ్యవసాయంలో ఉంది. ఇందులో అటవీ పెంపకం, చేపలు పట్టడంపై ఫోకస్ పెట్టారు. ఈ సంఖ్య స్వయం ఉపాధి, వేతనం లేని కుటుంబ కార్మికులను మినహాయించగలదు. ఉన్నత-మధ్య  అధిక-ఆదాయ దేశాలలో మహిళా రైతుల శాతం 10% కంటే తక్కువగా ఉండగా, తక్కువ-ఆదాయ.. దిగువ-మధ్య-ఆదాయ దేశాలలో మహిళలకు వ్యవసాయం అత్యంత ముఖ్యమైన ఉపాధి రంగం. అయినప్పటికీ  పురుషుల కంటే మహిళా రైతులకు చాలా తక్కువ భూమిలో ఎక్కు లాభాలను ఆర్జిస్తున్నారు.

మహిళల వాటా 12.8%

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూస్వాముల్లో మహిళలు 12.8% మాత్రమే ఉన్నారు. తరచుగా వారి ప్రయత్నాల అపారత గుర్తించబడదు. వ్యవసాయంలో మహిళల పాత్ర చరిత్రలో సమానంగా గుర్తించడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం కనిపిస్తుంది. 2016లో ఆస్ట్రేలియా వ్యవసాయ శ్రామిక శక్తిలో 32% మంది మహిళలు ఉన్నారని సెన్సస్ డేటా పేర్కొంది. నేడు వారు ఆస్ట్రేలియా వ్యవసాయ ఆదాయంలో కనీసం 48% ఉత్పత్తి మహిళలే చేస్తున్నారని తేలింది.  

ఆస్ట్రేలియన్ మహిళా రైతు ఒలింపియా యార్గర్

ఒలింపియా యార్గర్ కూడా అలాంటి మహిళా రైతు.. సూర్యుడు పొద్దు పొడిచిన వెంటనే వ్యవసాయ క్షేత్రంలోకి దిగిపోతారు. ఆమె ఉదయం ఎనిమిది గంటల వరకు ఆవులకు ఆహారం అందిస్తుంది. దీనికి ముందు తన క్షేత్రంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ నుంచి గుడ్లను సేకరిస్తారు. వాతావరణ నియంత్రణ వ్యవస్థలను పరిశీలిస్తారు. సిటీ అమ్మాయిగా పెరిగిన యార్గర్ ఎప్పుడూ జంతువుల మధ్య ఉండటం ఆనందింగా ఉందని అంటోంది. ఆమె గుర్రపు స్వారీని చాలా ఇష్టపడింది. వారాంతాల్లో చాలా వరకు తన స్నేహితుల పొలాల్లో గడిపింది.

వ్యవసాయరంగంలో మహిళలదే కీలకపాత్ర

యార్గార్ లాగా, వ్యవసాయంలో చాలా మంది మహిళలు సాంప్రదాయ మూస పద్ధతులను ధిక్కరించి వ్యవసాయ-పరిశ్రమ రంగంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. సామాజిక, పర్యావరణ న్యాయ స్ఫూర్తితో మహిళా రైతులు అభివృద్ధి చెందుతున్నారు. వ్యవసాయాన్ని మార్చడం సాధ్యమని.. వ్యవసాయం లాభదాయకమని నిరూపించాలని చూస్తున్నారు.  కాస్మోస్ మ్యాగజైన్ ప్రకారం.. న్యూ ఇంగ్లండ్, NSW విశ్వవిద్యాలయంలో రాజకీయ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ సంబంధాలలో లెక్చరర్ అయిన డాక్టర్ లూసీ న్యూసోమ్  “వ్యవసాయ సంస్థలో మహిళలు ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటారు.. కానీ వారు రైతులుగా గుర్తించబడటం లేదని అన్నారు. అయితే రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..