నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం.. ఈ పరిస్థితి అసలు కారణాలేంటీ..?
ఉడుకెత్తిన ఐరోపా. విస్తుపోతున్న ప్రపంచం. ఔను, నిజంగా షాకింగే ఇది. కాసింత రిలీఫ్ కావాలనుకున్నప్పుడు ఛలో యూరప్ అనడం ఎలైట్ గ్రూప్‌లో చాలా కామన్. యూకేకో, స్విట్జర్లాండ్‌కో, ఫ్రాన్స్‌కో, గ్రీన్‌ల్యాండ్‌కో, స్పెయిన్‌కో ఒక్క ట్రిప్ వేస్తే చాలు లైఫ్ అంతా రిఫ్రెష్ ఐనట్టు ప్లెజెంట్ ఫీలింగ్. ఏదో కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించామన్న భావన. అంత కలర్‌ఫుల్ ఖండం ఇప్పుడు విలవిల్లాడిపోతోంది. సలసలా కాగిపోతోంది. ప్రపంచానికే అంటరానిదైంది. యూరప్ ఖండాన్ని ఓడిస్తున్న రెండు శత్రువుల గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..

గోళం గందరగోళమైంది.. ప్రపంచమే యుద్ధం అంచున నిలబడింది అనుకున్నప్పుడు కూడా ఆ ఖండం గురించి ప్రస్తావనే లేదు. మూడేళ్లుగా నాన్‌స్టాప్‌గా రగులుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో గానీ, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పదినెలల నుంచి నలుగుతూ రావణకాష్టంగా మారిన మిడిలీస్ట్‌తో గానీ ఏమాత్రం సంబంధం లేదు. మండుతున్న గల్ఫ్‌తో కూడా భౌగోళికంగా ఏ టచ్చూ లేదు. నిన్నటిదాకా వైట్ అండ్ వైట్‌లో తళతళా మెరిసి, ప్లెజెంట్‌గా కనిపించిన ఆ ఖండానికి ఇప్పుడేమైంది? ప్రపంచమంతా ఆ ఖండం మీదే ఎందుకంత జాలిచూపులు చూస్తోంది?. నిన్నటిదాకా ఆల్ ఈజ్ వెల్ అనుకున్నాం.. ఇప్పుడైతే ఆగమాగమౌతోంది. అన్నివిధాలా బలమైన యూరప్ ఖండం ఇప్పుడు డేంజర్‌జోన్‌గా మారింది. 27 సభ్యదేశాలున్న యూరోపియన్ యూనియన్‌లో సగానికి సగం ఆర్ఖికంగా, సామాజికంగా చితికిపోతోంది. ఆరేడు దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వెంటాడుతుంటే, ప్రభుత్వాలు ఏం చేయాలో దిక్కుతోచక ప్రశ్నార్థకాలుగా మిగిలిపోయాయి. ఔను, ఒకేసారి రెండు భీకరమైన శత్రువులతో పోరాడుతోంది యూరప్ ఖండం. ఒకపక్క ఎల్‌నినో మంటలు.. మరోపక్క, అశాంతి సెగలు! నాలుగునెలల కిందట మిడ్ సమ్మర్‌లో ఎండవేడిమికి తట్టుకోలేక విలవిల్లాడిపోయిన యూరప్.. అని ఒక వార్త. రోమ్, వెనిస్, మిలాన్ సిటీస్‌లో రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లో ఒక అణువిద్యుత్ కేంద్రాన్నే మూసివేయాల్సి వచ్చింది. ఊరిని చల్లబరచడానికి దగ్గరున్న నదినీళ్లను పిచికారీ చేస్తారు. ఆ ఛాన్స్ కూడా లేకుండా ఎండ సెగతో నదినీరు వేడెక్కి ఆవిరైపోయింది. వందేళ్లలో ఎప్పుడూ చూడని టెంపరేచర్లతో 13 వందల మంది...
