AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే శరీరంలో ఏం జరుగుతుంది..? మీరు ఊహించని నిజాలు ఇవే..

కాలంతో సంబంధం లేకుండా అతి తక్కువ ధరకు దొరికే పండు అరటిపండు. వరుసగా 45 రోజుల పాటు రోజూ ఒక్క అరటిపండు తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. గుండె పనితీరు మెరుగుపడటం దగ్గర్నుంచి దీర్ఘకాలిక మలబద్ధకం మాయమవడం, లైంగిక సామర్థ్యం పెరగడం వరకు ఈ పండు చేసే మేలు అంతా ఇంతా కాదు. సీనియర్ డైటీషియన్ ఎస్. స్వాతి సూచిస్తున్న ఆ 45 రోజుల మ్యాజికల్ ఫార్ములా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Oct 24, 2026 | 9:36 PM

Share
మలబద్ధానికి చెక్: అరటిపండులో పెక్టిన్ అనే కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. 45 రోజుల పాటు క్రమం తప్పకుండా అరటిపండు తింటే ప్రేగుల కదలికలు మెరుగుపడతాయి. ఫలితంగా దీర్ఘకాలిక మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇది పేగుల్లో మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా వృద్ధిని పెంచి, తిన్న ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

1 / 5
గుండెకు రక్షక కవచం.. బీపీ నియంత్రణ: హైపర్ టెన్షన్, గుండె జబ్బుల సమస్యతో బాధపడేవారికి అరటిపండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో సోడియం పరిమాణం చాలా తక్కువగాను, పొటాషియం అధికంగానూ ఉంటుంది. ఈ పొటాషియం రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి, రక్తప్రసరణను సాఫీగా సాగేలా చేస్తుంది. ప్రతిరోజూ ఒక పండు తినడం ద్వారా గుండెపోటు, పక్షవాతం వచ్చే రిస్క్‌ను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ఇన్‌స్టంట్ ఎనర్జీ.. కండరాల పటిష్టత: రోజంతా బద్ధకంగా, నీరసంగా ఉండే వారికి అరటిపండు తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అనే సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి అలసట రాకుండా వేగంగా ఎనర్జీని ఇస్తాయి. వ్యాయామం చేసేవారికి కండరాల నొప్పులు రాకుండా చేయడంలో అరటిపండులోని మెగ్నీషియం, పొటాషియం కీలకపాత్ర పోషిస్తాయి.

3 / 5
ఒత్తిడి మాయం.. డిప్రెషన్, నిద్రలేమికి చెక్:  శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతతకు అరటిపండు ఎంతగానో మేలు చేస్తుంది. అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో చేరిన తర్వాత సెరోటోనిన్‌గా మారుతుంది. ఈ సెరోటోనిన్ నాడీ వ్యవస్థను శాంతింపజేసి, ఒత్తిడి మరియు డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. రాత్రిపూట ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పట్టేందుకు ఇది సహాయపడుతుంది.

4 / 5
లైంగిక సామర్థ్యం పెంపు:  వైవాహిక జీవితంలో సంతృప్తిని పెంచడంలో, శృంగార సమస్యలను దూరం చేయడంలో అరటిపండు సహాయపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. దులో ఉండే బ్రోమెలైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి లైంగిక కోరికలను ఉత్తేజపరుస్తుంది. దీన్నిలోని పొటాషియం జననేంద్రియాలకు రక్త ప్రసరణను వేగవంతం చేసి, నరాల బలహీనతను తగ్గిస్తుంది. విటమిన్ బి, మెగ్నీషియం శారీరక అలసటను దూరం చేసి, మరింత ఉత్సాహాన్ని, స్టామినాను అందిస్తాయి.

5 / 5
Follow Us