ఇడ్లీ, దోస పిండిని ఎన్ని రోజులు ఫ్రిజ్‌లో ఉంచడం సేఫో తెలుసా?

24 Oct 2026

Anand T

ప్రతి ఇంట్లో రోజూ బ్రెక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ, దోశలు చేసుకుంటారు. మిగిలిన పిండిని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి వాడుతూ ఉంటారు.

ఇడ్లీ పిండి

ఫ్రిజ్‌లో పెట్టినా కూడా బ్యాక్టీరియా చర్యలు వల్ల పులుసే ప్రక్రియ జరుగుతూనే ఉంటుందట. ఇలా ఎక్కవగా పులిసిన పిండిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట

పులిసే ప్రక్రియ

ఎక్కువ రోజులు పులిసిన పిండిలో కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులు ఉత్పత్తి అవుతాయట. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయట

జీర్ణక్రియకు ఆటంకం

తాజాగా పులిసిన పిండిలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి మంచి చేస్తే ఎక్కువ రోజుల నిల్వచేసిన పండిలో ఉండే బ్యాక్టీరియా శరీరానికి హానీ చేస్తుందట

మంచిదైనా ముప్పే!

ఇలా ఎక్కవ రోజులు పులిసిన పిండిన తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, డయేరియా వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కడుపు సమస్యలు

ఒక వేళ మీరు ప్రిజ్‌లో పెట్టినా 24 గంటల్లోపే దాన్ని వాడాలని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదని చెబుతున్నారు..

24 గంటలే

ఇలా ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వల్ల పిండి బాగా గట్టిపడటం లేదా మరీ పలచగా మారడం జరుగుతుంది. దీంతో దోశలు, ఇడ్లీలు సరిగ్గా రావు, రుచి కూడా పాడవుతుంది.

నాణ్యత సమస్య

పిండి త్వరగా పులియకూడదంటే కలిపేటప్పుడే ఉప్పు వేయకుండా నిల్వ చేసి, వాడుకునే ముందు అవసరమైనంత పిండిలోనే ఉప్పు కలుపుకోవడం మంచిది.

పులియకుండా చిట్కా