AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: మస్క్.. నువ్వు గ్రేట్! మెదడులో చిప్ పని చేస్తోందోచ్!

ఎలన్ మస్క్ నిజంగా గ్రేట్! అనుకున్నది సాధించాడు. ప్రపంచంలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినా పట్టుబట్టి ప్రయోగం చేశాడు. అదే.. బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చడం. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఈ ప్రయోగం.. నిజంగా రాబోయే మరికొన్ని ప్రయోగాలకు మార్గం సుగుమం చేసినట్టే.

Elon Musk: మస్క్.. నువ్వు గ్రేట్! మెదడులో చిప్ పని చేస్తోందోచ్!
Elon Musk
Gunneswara Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 21, 2024 | 8:40 AM

Share

ఎలన్ మస్క్ నిజంగా గ్రేట్! అనుకున్నది సాధించాడు. ప్రపంచంలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినా పట్టుబట్టి ప్రయోగం చేశాడు. అదే.. బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చడం. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఈ ప్రయోగం.. నిజంగా రాబోయే మరికొన్ని ప్రయోగాలకు మార్గం సుగుమం చేసినట్టే. కొద్ది రోజుల కిందట మనిషి మెదడులో చిప్ అమర్చింది న్యూరాలింక్. ఇప్పుడు ఆ చిప్ ఉన్న వ్యక్తి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్‌ను కంట్రోల్ చేయగలుగుతున్నాడు. మస్క్ చెప్పిన ఈ మాటలు.. అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేశాయి. బ్రెయిన్‌లో చిప్ ఉన్న వ్యక్తి.. తన ఆలోచనలతోనే.. మౌస్‌ను స్క్రీన్‌పై అటూ ఇటూ మూవ్ చేయగలుగుతున్నాడు. అంటే కేవలం ఆలోచనలతోనే దానిని కమాండ్ చేయగలుగుతున్నాడు.

కేవలం మౌస్‌ను మూవ్ చేయడమే కాకుండా మౌస్ బటన్స్‌పై ఎక్కువ క్లిక్స్ వచ్చేలా న్యూరాలింక్ ప్రయత్నిస్తోంది. ఆలోచనల వల్ల ఆ చిప్ ద్వారా మౌస్‌ను ఇంకా వేగంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు అనుకున్న రిజల్ట్ వచ్చింది కాబట్టి.. మస్క్‌ని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిజానికి ఈ ఆపరేషన్ చేపట్టడానికి మస్క్ చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. మనుషులపై ఈ చిప్‌ను ప్రయోగించడానికి సెప్టెంబర్‌లోనే పర్మిషన్స్ తీసుకున్నాడు. తరువాత ఈ ఏడాది జనవరిలో మనిషి బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చారు. అప్పటి నుంచి అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. దీని రిజల్ట్ ఎలా ఉంటుందా అని అందరూ చాలా టెన్షన్‌తో ఎదురుచూశారు. అలాంటివారందరికీ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు.

మెదడులో చిప్ ఎందుకు పెట్టారు అంటే.. ప్రస్తుతానికైతే.. కంప్యూటర్ కీబోర్డ్, మౌస్‌ను కంట్రోల్ చేయడానికే అంటున్నా.. భవిష్యత్తులో మాత్రం ఈ ప్రయోగం వల్ల భారీ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. శరీరంలో కాళ్లు, చేతులు పనిచేయకపోతే వాటిలో కదలికలు తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందంటున్నారు. ఇక మానసిక సమస్యలు, నాడీ సమస్యలు, అల్జీమర్స్ వంటి వాటికి చికిత్సలోనూ దీని ఫలితాలను ఉపయోగించుకునే అవకాశముంది. అందుకే ఇలాంటి చిప్ ప్రయోగానికి మస్క్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఆయన పట్టుదల వల్ల ఏళ్లనాటి కల సాకారమైంది. ఇప్పటికైతే దీని వల్ల సమస్యలు లేకపోయినా.. దీని రిజల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవడం అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి.

8 మిల్లీ మీటర్ల వ్యాసమున్న N1 అనే చిప్.. వెంట్రుకలో 20వ వంతు ఉంటుంది. దీనికి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. బ్రెయిన్‌లోకి దీనిని అమర్చుతారు. ఈ ఎలక్ట్రోడ్లను బ్రెయిన్‌లోకి పంపిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఒక చిప్ లో దాదాపు 3 వేల ఎలక్ట్రోడ్లు ఉంటాయని. ఇక మైండ్‌లోని న్యూరాన్‌లో ఉండే సందేశాలను ఇవి బ్రెయిన్‌కు చేరవేస్తాయి. ఇవి కంప్యూటర్ల అల్గరిథమ్‌లుగా మారతాయి. నిజానికి ఇలాంటి ప్రయోగాల్లో ఒక వ్యక్తి బ్రెయిన్‌‌లో 10 చిప్‌లను అమర్చవచ్చు.

న్యూరాలింక్ చిప్ ప్రయోగం కొత్తదేమీ కాదు. కాకపోతే గతంలో కోతులు, పందుల్లో పరీక్షించారు. అప్పుడే ఇది సేఫ్ అని శాస్త్రవేత్తలు భావించారు. తరువాత మనుషుల్లో బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ ఫేస్ ప్రయోగానికి అమెరికాలోని FDA పర్మిషన్ ఇచ్చింది. ఆ తరువాత మనిషి మెదడును కంప్యూటర్‌తో అనుసంధానించడానికి అడుగు ముందుకు పడింది. అప్పట్లో ఈ ప్రయోగం వల్ల ఓ కోతి.. ఒక వీడియో గేమ్‌ను కూడా ఆడగలిగింది. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చడమంటే చిన్న విషయమేమీ కాదు. అందుకే ఇలాంటి ప్రాజెక్టుపై తక్కువ సంస్థలు ప్రయోగాలు చేస్తాయి. అయితే మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌తో పాటు ఇలాంటి ప్రయోగాన్ని మరికొన్ని సంస్థలు కూడా చేశాయి. 2022 జూలైలో అమెరికాకు చెందిన ఒకరికి ఇలాంటి చిప్‌ను అమర్చారు. దీనిని సింక్రాన్ అనే ఆస్ట్రేలియా సంస్థ టేకప్ చేసింది. కాకపోతే న్యూరాలింక్‌లో బ్రెయిన్‌కు కోత పెట్టి చిప్ పెట్టారు. ఈ కంపెనీ మాత్రం అలా చేయలేదు. మరి న్యూరాలింక్ ప్రాజెక్ట్ మాత్రమే ఎందుకు వెలుగుచూసింది అంటే.. మస్క్‌కు ఉన్న పాపులారిటీ వల్ల ఈ సంస్థ ప్రయోగం గురించి ఎక్కువమందికి తెలిసింది. కానీ ఫ్యూచర్‌లో దీని ఫలితాలను మానవాళి మేలు కోసమే ఉపయోగించుకునేలా చూడాలి.