AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సునీతా విలియమ్స్‌ను అంతరిక్షంలో వదిలివేయాలనుకున్నారు.. బిడెన్‌పై ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు!

జూన్ 2024లో, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్‌లైనర్‌లో ISSకి ఎనిమిది రోజుల మిషన్‌కు వెళ్లారు. హీలియం లీక్, థ్రస్టర్ వైఫల్యం వంటి సాంకేతిక సమస్యల కారణంగా స్టార్‌లైనర్ తిరిగి రావడానికి సురక్షితం కాకపోవడంతో అప్పటి నుండి వారు అక్కడే నిలిచిపోయారు. మార్చి 2025 చివరి నాటికి మిషన్ పూర్తి చేయాలని కొత్త అధ్యక్షులు ట్రంప్ ఫ్లాన్ చేశారు.

సునీతా విలియమ్స్‌ను అంతరిక్షంలో వదిలివేయాలనుకున్నారు.. బిడెన్‌పై ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు!
Us Atronauts
Balaraju Goud
|

Updated on: Feb 19, 2025 | 6:58 PM

Share

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి రావడంపై అమెరికన్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ లు జో బిడెన్ పరిపాలన తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వదిలివేయాలని కోరుకున్నారని అన్నారు. ఈ ప్రకటన తర్వాత, అమెరికాలో రాజకీయ వివాదం మరింత రాజుకుంది.

సునీతా విలియమ్స్ తోపాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ దాదాపు 10 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. జూన్ 5, 2024న బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో NASA మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయాణించారు. కానీ సాంకేతిక లోపాల కారణంగా వారు తిరుగు ప్రయాణం చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు వారు మార్చి 2025లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో తిరిగి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వారు తిరిగి రావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు ఎలోన్ మస్క్ సంచలన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గత అధ్యక్షులు బైడెన్ తోపాటు అతని పాలనా యంత్రాంగం వ్యోమగామిలను అంతరిక్షంలోనే వదిలివేయాలనుకుందన్నారు.

బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం కారణంగా సునీత విలియమ్స్, బుచ్ గత ఏడాది జూన్ నుండి అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిద్దరూ స్టార్‌లైనర్‌లో 8 రోజుల మిషన్‌పై ISSకి వెళ్లారు. అయితే ఇటీవల ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సునీతా, బుచ్ ఇద్దరినీ గురించి ప్రశ్నించినప్పుడు, ట్రంప్ సమాధానం ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రాజకీయ కారణాల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయారన్నారు. బైడెన్ పరిపాలన వారిని అంతరిక్షంలోనే వదిలివేయాలనుకుందన్నారు.

అయితే, ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్ వాదనను సమర్థించారు. “అవును, రాజకీయ కారణాల వల్ల వారిని అక్కడే వదిలేశారు. ఇది మంచిది కాదు.” అన్నారు. ” ఇది హాస్యాస్పదమైన స్థాయిలో వాయిదా పడింది. అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు, వ్యోమగాముల తిరిగి తీసుకురావడాన్ని మేము వేగవంతం చేస్తున్నాము” అని ఆయన అన్నారు. స్పేస్‌ఎక్స్ ఇంతకు ముందు చాలాసార్లు విజయవంతమైన మిషన్లను నిర్వహించిందని, ఈసారి కూడా వ్యోమగాములు పూర్తి భద్రతతో తిరిగి వచ్చేలా చూస్తామని మస్క్ అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి ఇచ్చే బాధ్యతను స్పేస్‌ఎక్స్‌కు అప్పగించినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో రాశారు. మార్చి 2025 చివరి నాటికి మిషన్ పూర్తి చేయాలని ఆయన మస్క్‌ను అభ్యర్థించారు. ఈ మొత్తం వివాదంపై బైడెన్ పరిపాలన నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా మిషన్ ఆలస్యం అవుతోందని నాసా ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ, వ్యోమగాముల భద్రతే వారి ప్రాధాన్యత. మార్చి 2025 లో స్పేస్‌ఎక్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను సురక్షితంగా తిరిగి తీసుకురాగలదా అనేది ఇప్పుడు చూడాలి..!

మిషన్ కాలక్రమం గురించి అడిగినప్పుడు, మస్క్, “వారిని తిరిగి తీసుకురావడానికి దాదాపు నాలుగు వారాలు పడుతుందని భావిస్తున్నాను” అని అన్నారు. ఈ సమయంలో, “ఇప్పుడు ఈ ప్రక్రియ కొనసాగడానికి అనుమతి లభించింది” అని ట్రంప్ అన్నారు. దానికి మస్క్ అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇది కాకుండా, మస్క్ కంపెనీకి బిడెన్ అధికారుల నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని ట్రంప్ పేర్కొన్నారు. జూన్ 2024లో, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్‌లైనర్‌లో ISSకి ఎనిమిది రోజుల మిషన్‌కు వెళ్లారు. హీలియం లీక్, థ్రస్టర్ వైఫల్యం వంటి సాంకేతిక సమస్యల కారణంగా స్టార్‌లైనర్ తిరిగి రావడానికి సురక్షితం కాకపోవడంతో అప్పటి నుండి వారు అక్కడే నిలిచిపోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..