ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేయనున్న ఎలాన్ మస్క్.. ధర అక్షరాల రూ. 646 కోట్లు.. అంతలా ఏముందనేగా..
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఏమంటూ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ట్విట్టర్‌లో తీసుకొచ్చిన మార్పులతో..
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఏమంటూ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ట్విట్టర్‌లో తీసుకొచ్చిన మార్పులతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్న ఎలాన్ మస్క్ జీవనశైలి అత్యంత ఆడంబరంగా ఉంటుంది. ఆయన ఉపయోగించే ప్రతీ వస్తువు లగ్జరీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా గల్ఫీస్ట్రీమ్ జీ700 అనే లగ్జరీ ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు మస్క్.
దీంతో మస్క్ మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాడు. మస్క్ కొనుగోలు చేస్తున్న ఈ కొత్త విమానం ధర 78 మిలియన్ డాలర్లు, మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 646 కోట్లు. అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ తయారు చేసిన విమానం లగ్జరీ కేరాఫ్‌గా ఉంటుంది. 2023 ప్రారంభంలో ఈ లేటెస్ట్ గల్ఫ్‌స్ట్రీమ్ G700 మస్క్ చేతికి రానుంది.
ఈ విమానం 51,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ఈ విమానంలో ఒక్కసారి ఇంధనం నింపితే ఏకంగా 75,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. 109 అడుగుల 10 అంగుళాల పొడవైన ఈ జెట్‌లో 57 అడుగుల క్యాబిన్ ఉంటుంది. ఈ విమానంలో రెండు టాయిలెట్లు, క్యాబిన్‌తో పాటు నాలుగు లివింగ్ ఏరియాలు ఉంటాయి. ఈ విమానంలో 19 మంది ప్రయాణించొచ్చు. విమానంలో ఎంటర్‌టైన్‌మెంట్ సూట్‌లు కూడా ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..