Nepal Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు

బుధవారం ఉదయం 5.42 గంటల సమయంలో భూ కంపించింది. ఖాట్మండు నగరానికి  113 కిలోమీటర్ల దూరంలోని లాంజంగ్ జిల్లా భుల్ భులీ కేంద్రంగా

Nepal Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు
Earthquake
Follow us
Sanjay Kasula

|

Updated on: May 19, 2021 | 8:22 AM

నేపాల్ ఒక్కసారిగా వణికిపోయింది. భారీ భూ ప్రకంపనలు రావడం దేశం మొత్తం కదలిపోయింది. ఖాట్మండుకు సమీపంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందైంది. గత ఆరు నెలల్లో ఇలాంటి భూ ప్రకంపనలు రావడం ఇది రెండో సారి. బుధవారం ఉదయం 5.42 గంటల సమయంలో భూ కంపించింది. ఖాట్మండు నగరానికి  113 కిలోమీటర్ల దూరంలోని లాంజంగ్ జిల్లా భుల్ భులీ కేంద్రంగా భూకంపం వచ్చిందని అక్కడి జాతీయ భూకంపాల పరిశోధనా సంస్థ తెలిపింది.

ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని జాతీయ భూకంపాల పరిశోధనా సంస్థ అధికారులు వెల్లడించారు. సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. బుధవారం ఉదయం అప్పుడప్పుడే నిద్ర లేస్తున్న నేపాలీలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. పెద్ద శబ్ధం రావడంతోపాటు నేల మొత్తం కదలినట్లుగా అనిపించిందని అంటున్నారు.

ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఖాట్మండు అధికారులు తెలిపారు. నేపాల్ దేశంలో గతంలో సంభవించిన భూకంపం వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.

ఇవి కూడా చదవండి:  Another System: అప్పుడే మించిపోలేదు.. ముంచేందుకు మరో తుఫాన్ రెడీ.. IMD మరో హెచ్చరిక..

Vaccination: వ్యాక్సిన్ మొదటి డోసు తరువాత కూడా పాజిటివ్ వస్తుందా? వస్తే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?