New Zealand Earthquake: న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో భారీ భూకంపం.. ప్రజలకు బిగ్ అలర్ట్..
న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ మేరకు యూఎస్‌జిఎస్ ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్ రివర్టన్ తీరంలో భారీగా ప్రకంపనలు వచ్చాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలెర్ట్ జారీ చేశారు.

న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ మేరకు యూఎస్‌జిఎస్ ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్ రివర్టన్ తీరంలో భారీగా ప్రకంపనలు వచ్చాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలెర్ట్ జారీ చేశారు. న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో ప్రారంభంలో 7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం సౌత్ ఐలాండ్ నైరుతి నుంచి 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో సంభవించిందని USGS తెలిపింది. ఇప్పటివరకు, ఈ ప్రాంతానికి ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు.. ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది..
అయితే.. ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని యూఎస్‌జిఎస్ పేర్కొంది. భారీ భూకంపం నేపథ్యంలో న్యూజిలాండ్ విపత్తు అత్యవసర నిర్వహణ సంస్థ వెంటనే అప్రమత్తమైంది.. సునామీ వచ్చే అవకాశం ఉందా..? అని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.. ఈ ప్రదేశంలో సునామీ ఏర్పడితే అది కనీసం ఒక గంట పాటు న్యూజిలాండ్‌కు వచ్చే అవకాశం లేదు.. అని ఏజెన్సీ పేర్కొంది.
బలమైన అసాధారణ ప్రవాహాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి.. కాబట్టి సౌత్‌ల్యాండ్, ఫియోర్డ్‌ల్యాండ్ ప్రాంతాల నివాసితులు బీచ్‌లు, సముద్ర ప్రాంతాలకు దూరంగా ఉండాలని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అలర్ట్ జారీ చేసింది. 4,700 మందికి పైగా ప్రజలు భూకంపాన్ని అనుభవించారని ప్రభుత్వ భూకంప నిఘా సంస్థ జియోనెట్ తెలిపింది.
గతంలో, 2011లో క్రైస్ట్‌చర్చ్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 185 మంది మృతి చెందారు.. USGS ప్రకారం, ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఇది ఒకటి. న్యూజిలాండ్‌లో, 3000 కి.మీ పొడవైన ఆస్ట్రేలియా-పసిఫిక్ ప్లేట్ సరిహద్దు మాక్వేరీ ద్వీపానికి దక్షిణం నుండి దక్షిణ కెర్మాడెక్ ద్వీప గొలుసు వరకు విస్తరించి ఉందని పేర్కొంది.
1900 నుండి, న్యూజిలాండ్ సమీపంలో 7.5 కంటే ఎక్కువ తీవ్రతతో దాదాపు 15 సార్లు భూకంపాలు సంభవించాయి.. న్యూజిలాండ్‌లోనే నమోదైన అతిపెద్ద భూకంపం 1931లో వచ్చింది. 7.8 తీవ్రతతో హాక్స్ బే భూకంపం సంభవించింది.. ఇది 256 మంది ప్రాణాలను బలిగొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..