AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: బిహార్‌లో దారుణం.. ట్రైన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం!

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జిల్లాలో దారుణం వెలుగుచూసింది. వికలాంగుడైన తండ్రితో పాటు రైల్వే స్టేషన్‌లో ఉన్న యువతిపై ముగ్గురు గుర్తుతెలియని యువకులు సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Bihar: బిహార్‌లో దారుణం.. ట్రైన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం!
Gopalganj Railway Station
Anand T
|

Updated on: Apr 29, 2025 | 4:04 PM

Share

తండ్రితో పాటు రైల్వే స్టేషన్‌లో వెయిట్‌ చేస్తున్న యువతిని లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో చోటుచేసుకుంది.  పోలీసుల వివరాల ప్రకారం.. ఓ యువతి అనారోగ్యంతో బాధపడుతున్న వికలాంగుడైన తన తండ్రికి హాస్పిటల్‌కు చూయించుకునేందుకు గోపాల్‌గంజ్‌కు వచ్చింది. హాస్పిటల్‌కు చూయించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు ..తండ్రిని తీసుకొని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అయితే వాళ్లు వెళ్లవలసిన ట్రైన్‌ అప్పటికే స్టేషన్‌ నుంచి వెళ్లి పోయింది. దీంతో ఆ తండ్రి, కూతుళ్లు ఇద్దరూ మరుసటి రోజు వచ్చే ట్రైన్‌ కోసం స్టేషన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో రాత్రి వాళ్లు అక్కడే స్టేషన్‌లోనే పడుకున్నారు.

ఈ క్రమంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆ యువతి తండ్రికి నీళ్ళు తీసుకురావడానికని వెళ్లింది. అయితే  అక్కడ ఉన్న ఓ ముగ్గురు దుండగులు ఆ యువతిని అడ్డుకొని.. అరవకుండా గట్టిన నోరు నొక్కిపట్టుకొని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత ఆ ముగ్గురు కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం.

అయితే నిందితుల దాడిలో తీవ్ర గాయాలైన యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని యువతిని హాస్పిటల్‌లకు తరలించారు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు గోపాల్‌గంజ్ ఎస్పీ అవధేష్ దీక్షిత్ తెలిపారు.

నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్‌ సమీపంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..