Train Accident: పట్టాలు తప్పిన రైలు.. 61 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Train Accident: కాంగోలో ఘోర(Congo Accident) రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 61 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు రైలు ప్రయాణిస్తోంది.

Train Accident: పట్టాలు తప్పిన రైలు.. 61 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
Train Accident
Follow us

|

Updated on: Mar 13, 2022 | 6:35 AM

Train Accident: కాంగోలో ఘోర(Congo Accident) రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 61 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు.. బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు రైలు బోగీలు(Rail Wagons) పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ 52 మందిని అధికారులు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ రైలు మెుత్తం 15 వ్యాగన్లతో ప్రయాణిస్తుండగా.. వాటిలో 12 బోగీలు ఖాళీవేనని అధికారులు తెలిపారు. సోమవారం నాటికి ఈ మార్గంలో సేవలను తిరిగి పునరుద్ధరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో పాజింసెర్ రైళ్లు, సరైన రోడ్డు మార్గాలు లేకపోవటం వల్ల ప్రజలు గూడ్స్ రైళ్లలో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారని తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రికులకు శుభవార్త.. ఏకంగా 20 వేల మందికి సరిపడా..

Air Services: వేసవి కాలంలో పెరగనున్న విమాన సర్వీసులు