AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా.. మోదీ ఎన్నో స్థానంలో ఉన్నారు?

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా మీకు తెలుసా.. అయితే తెలుసుకుందాం పదండి. ఫోర్బ్స్ నివేదికల ప్రకారం 2025లో ప్రపంచంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ప్రపంచ నాయకులు, టెక్ టైకూన్లు ఆధ్యాత్మిక ప్రముఖులు, రాజకీయ నాయకులు విద్యావేత్తలు, రాజులు ఇలా ఎందరో ఉన్నారు. అయితే ఆ టాప్‌ 10 వ్యక్తుల్లో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా.. మోదీ ఎన్నో స్థానంలో ఉన్నారు?
Anand T
|

Updated on: May 19, 2025 | 5:17 PM

Share

ప్రస్తుత ప్రపంచంలో, అధికారం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఇది ప్రపంచ స్థాయిలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కూడా. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ప్రధాన దేశాలు, ప్రధాన సంస్థలను నడిపే వ్యక్తులు లేదా ప్రపంచ సంభాషణలకు దోహదపడే వ్యక్తులు కూడా కావచ్చు. ఈ ప్రపంచ నాయకులు అంతర్జాతీయ విధానాన్ని నిర్దేశిస్తారు, వీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తారు. అలాగే శాంతి, అభివృద్ధి వంటి రంగాలలో ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తారు. ఇలానే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన బలమైన నాయకత్వం, సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేశారు. ప్రపంచ దక్షిణాదిలో ఆయన పాత్ర, చురుకైన దౌత్యం, పెరుగుతున్న ఆర్థిక శక్తి ఆయనను నేటి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా చేశాయి.

1. జి జిన్‌పింగ్ – చైనా

ప్రపంచంలోని టా 10 శక్తివంతమైన వ్యక్తుల జాబితాను చూసుకుంటే అందులో మొదటి స్థానంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping) ఉన్నారు. ఇతను ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు. ఆయన నిర్ణయాలు గ్లోబల్ రాజకీయాలు.

2. వ్లాదిమిర్ పుతిన్ – రష్యా

రెండో ప్లేస్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఉన్నారు. ఇయన 2000 సంవత్సరం నుంచి రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. పుతిన తన దగ్గర ఉన్న సైనిక శక్తి సహజ వనరుల ద్వారా భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్యాలో ఉన్న అతిపెద్ద సహజ వాయు నిల్వలు, స్పేస్ ప్రోగ్రామ్‌లు ప్రపంచంపై ఆయన ప్రభావాన్ని పెంచుతున్నాయి.

3. డోనాల్డ్ ట్రంప్ – యునైటెడ్ స్టేట్స్

ఇక మూడో స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక, సైనిక శక్తి అయిన అమెరికాను ఈయన నడిపిస్తున్నారు. ఆయన విధానాలు టెక్నాలజీ, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను ప్రభావితం చేస్తాయి. ఆయన అమెరికన్ రాజకీయాలతో పాటు ప్రపంచ వ్యవహారాలను, ముఖ్యంగా తన బలమైన సాహసోపేతమైన ప్రకటనలతో ప్రభావితం చేస్తారు.

4. ఏంజెలా మెర్కెల్ – జర్మనీ

ఇక నాలుగో స్థానంలో జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఉన్నారు. ఈమె తన ప్రశాంతమైన, తెలివైన నాయకత్వానికి కలిగి ఉంటారు. ఈమె యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపించారు. ఈమె నిర్ణయాలు కూడా అంతర్జాతీయ విషయాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.

5. జెఫ్ బెజోస్ – అమెజాన్ వ్యవస్థాపకుడు

ఇక ఐదో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) ఉన్నారు. ఇతను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఆన్‌లైన్ రిటైల్, అంతరిక్ష అన్వేషణలో ఆయన విజయం ఆయనను శక్తివంతమైన ప్రపంచ వ్యక్తిగా మార్చింది.

6. పోప్ ఫ్రాన్సిస్ – రోమన్ కాథలిక్ చర్చి

ఇక ఆరో స్థానంలో రోమన్ కాథలిక్ చర్చి మాజీ పోప్‌ పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది కాథలిక్కులకు ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన 21 ఏప్రిల్ 2025న అనారోగ్యంతో మరణించారు, ఇది మొత్తం ప్రపంచాన్ని దుఃఖంలో ముంచెత్తింది. ఆయన శాంతి, కరుణ, మతాంతర ఐక్యతను ప్రోత్సహించారు, మతాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ విధానాలను కూడా ఈయన ప్రభావితం చేశారు.

7.బిల్ గేట్స్ – మైక్రోసాఫ్ట్ యజమాని

ఇక ఏడో స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. ఈయన ఒక ప్రపంచ దాత. తన ఫౌండేషన్ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలనలో ప్రభావం చూపుతున్నారు.ఆయన ఫిలాంత్రోపిక్ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరుస్తున్నాయి.

8. మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ – సౌదీ అరేబియా

ఇక ఎనిమిదవ స్థానంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు. ఇతను ప్రపంచంలోనే అత్యధిక చమురు ఎగుమతి చేసే దేశాన్ని నియంత్రిస్తున్నారు. ఆయన సౌదీ సమాజంలో సాహసోపేతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అంతే కాకుండా రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నారు.

9. నరేంద్ర మోడీ – భారతదేశం

ఇక తొమ్మిదో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందింది. జాతీయ భద్రత, ప్రపంచ దౌత్యంపై ఈయన బలమైన నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయి. ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరంపై దాడి చేయడంతో భారతదేశం ఉగ్రవాదాన్ని సహించదని ఆయన ప్రపంచానికి తెలియజెప్పారు.

10. లారీ పేజ్ – ఆల్ఫాబెట్ (గూగుల్)

ఇక పదో స్థానంలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ (Larry Page) ఉన్నారు. ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఇంటర్నెట్ సర్వీసెస్‌లో గూగుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ యాక్సెస్‌ను మార్చివేశారు. టెక్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా, గ్లోబల్ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను రూపొందిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..