AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ విద్య ప్రపంచీకరణలో ముందడుగు.. దుబాయ్‌లో ఐఐఎం అహ్మదాబాద్ ప్రారంభం

ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్‌లో తన కొత్త క్యాంపస్‌కు శ్రీకారం చుట్టింది. గురువారం (సెప్టెంబర్ 11) దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, భారతీయ విద్య ప్రపంచీకరణలో ఇది ఒక పెద్ద ముందడుగు అని అన్నారు.

భారతీయ విద్య ప్రపంచీకరణలో ముందడుగు.. దుబాయ్‌లో ఐఐఎం అహ్మదాబాద్ ప్రారంభం
Dharmendra Pradhan , Sheikh Hamdan
Balaraju Goud
|

Updated on: Sep 11, 2025 | 6:06 PM

Share

ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్‌లో తన కొత్త క్యాంపస్‌కు శ్రీకారం చుట్టింది. గురువారం (సెప్టెంబర్ 11) దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, భారతీయ విద్య ప్రపంచీకరణలో ఇది ఒక పెద్ద ముందడుగు అని అన్నారు. ఇది భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి తీసుకెళుతుందన్నారు.

విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సెప్టెంబర్ 10-11 తేదీలలో రెండు పర్యటనకు గాను యుఎఇ చేరుకున్నారు. ఈ పర్యటన ఉద్దేశ్యం రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచడం. ఈ సందర్భంగా, తొలి విదేశీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్ క్యాంపస్ ప్రారంభించారు. విద్యా రంగంలో సహకార అవకాశాలను అన్వేషించడం, విద్యా నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, రెండు దేశాల విద్యార్థులు, యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను కనుగొనడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని కేంద్ర విద్యా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్ క్యాంపస్ ప్రారంభోత్సవానికి సంబంధించి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా X లో షేర్ చేశారు. “ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్ క్యాంపస్‌ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించడం చాలా గౌరవప్రదమైన విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించిన విధంగా భారతీయ విద్య ప్రపంచీకరణ వైపు ఇది మరో పెద్ద ముందడుగు. ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్ క్యాంపస్ భారతదేశపు అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి తీసుకువస్తుంది. ఐఐఎం అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ క్యాంపస్‌ను నిర్వహించడం ద్వారా భారతీయ స్ఫూర్తి, ప్రపంచ దృక్పథం అనే సూత్రానికి దుబాయ్ ఒక ఆదర్శవంతమైన వేదికను అందించింది. భారతదేశం-యుఎఇ జ్ఞాన సహకారానికి ఒక అద్భుతమైన అధ్యాయాన్ని జోడించినందుకు షేక్ హమ్దాన్‌కు ధన్యవాదాలు.” అంటూ కేంద్ర మంత్రి రాసుకొచ్చారు.

ఈ పర్యటన సందర్భంగా, విద్య, ఆవిష్కరణ, జ్ఞాన మార్పిడిలో భాగస్వామ్యాలను పెంపొందించడానికి ధర్మేంద్ర ప్రధాన్ UAEలోని కీలక నాయకులు, మంత్రులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, భారత్, UAE సంస్థల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. బుధవారం, ధర్మేంద్ర ప్రధాన్ అబుదాబి విద్య, జ్ఞాన విభాగం చైర్‌పర్సన్ సారా ముసల్లంను కలిశారు. ఆయన IIT ఢిల్లీ-అబుదాబి క్యాంపస్‌ను కూడా సందర్శించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..