Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant Death: తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు.. ఎక్కడంటే..

Omicron Variant Death: సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొత్తవేరియంట్‌ పుట్టుకురావడం

Omicron Variant Death: తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు.. ఎక్కడంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2021 | 6:27 PM

Omicron Variant Death: సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొత్తవేరియంట్‌ పుట్టుకురావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది.  ఈ మేరకు ఒమిక్రాన్‌ తొలి మరణం నమోదైనట్లు యూకే పీఎం బోరిస్‌ జాన్సన్‌ ధృవీకరించారు. నవంబర్‌ 27న యూకేలో ఒమిక్రాన్‌ కేసులు నమోదైనప్పటి నుంచి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే ఒమిక్రాన్‌ కేసుల్లో యూకే మొదటి స్థానంలో ఉంది. దీంతో యూకేలో ఒమిక్రాన్‌ ఎమర్జెన్సీ విధించింది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వేరియంట్‌ వ్యాప్తి బ్రిటన్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌, ట్రాపికల్‌ మెడిసిన్‌ ఇటీవల వెల్లడించింది. ముందస్తుగా చర్యలు తీసుకోకపోతే మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వేరియంట్‌ వల్ల యూకేలో భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.

వెల్లడించింది. ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 60 శాతం పెరగనున్నట్లు తెలిపింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌, ట్రాపికల్‌ మెడిసిన్‌తోపాటు దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్త అధ్యయనంలో తెలిపారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్రత, టీకాల ప్రభావం ఆధారంగా వారు ఈ అధ్యయనం చేశారు.

అలాగే ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రంగా వ్యాపిస్తోంది. శనివారం ఒక్క రోజు 600 కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాబోయే రెండు వారాల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు నిపుణులు.

భారత్‌లో..

ఇక భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి.. తాజాగా కర్ణాటకలో మూడో కేసు బయట పడగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్, మహారాష్ట్ర ఒక్కో కేసు నమోదైయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 33కేసులు ఉండగా తాజా మరో 5 కేసులు బయట పడ్డాయి.. కర్ణాటకలో మూడో కేసు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్, మహారాష్ట్ర ఒక్కో కేసు నమోదైయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. ఢిల్లీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. చండీగఢ్‌లో బంధువులను కలిసేందుకు ఇటలీ నుంచి వచ్చిన యువకునికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అతని నమూనాలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపింతే అక్కడ ఒమిక్రాన్‌ వేరియంట్‌గా తేల్చారు. అయితే, ఆ యువకుడిలో ఒమిక్రాన్‌ లక్షణాలు ఏవీ లేవని, ఇప్పటికే ఇటలీలో రెండు డోసుల టీకా తీసుకున్నాడని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Covid Vaccine: 24 గంటల్లో ఏకంగా 10 సార్లు కొవిడ్‌ టీకా తీసుకున్నాడు.. చివరికి ఏం జరిగిందంటే..

Omicron test: ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు కొత్త పరికరం.. అవిష్కరించిన ఐసీఎంఆర్.. గంటల్లోనే ఫలితం!