AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: 24 గంటల్లో ఏకంగా 10 సార్లు కొవిడ్‌ టీకా తీసుకున్నాడు.. చివరికి ఏం జరిగిందంటే..

ఇండియాతో పాటు చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. టీకా తీసుకోవడం వల్ల

Covid Vaccine: 24 గంటల్లో  ఏకంగా 10 సార్లు కొవిడ్‌ టీకా తీసుకున్నాడు.. చివరికి ఏం జరిగిందంటే..
Basha Shek
|

Updated on: Dec 13, 2021 | 5:12 PM

Share

ఇండియాతో పాటు చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. టీకా తీసుకోవడం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలకు తోడు వ్యాక్సిన్‌పై అపోహలు, అనుమానాలే దీనికి కారణం. ఇంకొందరు ఆరోగ్య కారణాలు చెప్పి టీకాను తీసుకోవడానికి జంకుతున్నారు. ఈనేపథ్యంలో న్యూజిలాండ్‌కి చెందిన ఒక మహానుభావుడు మాత్రం ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌లు తీసుకున్నాడు. అది కూడా కేవలం 24 గంటల వ్యవధిలో. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం 24 గంటల్లో 10 సార్లు టీకా తీసుకున్నాడు. ఇది నిజమా? అబద్ధమా? అని తేల్చేందుకు న్యూజిలాండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా ఇది నిజమేనని నిర్ధారించింది. విచారణలో ఆ సదరు వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులతో వ్యాక్సిన్లు తీసుకున్నాడని పేర్కొంది.

కాగా న్యూజిలాండ్‌లో కరోనా కట్టడి కోసం అక్టోబర్‌ నుంచి జీరో కొవిడ్‌ స్ట్రేటజీని అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా టీకా తీసుకునే వ్యక్తుల గుర్తింపు కార్డులపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈక్రమంలోనే సదరు వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులతో 24 గంటల్లో ఏకంగా 10 సార్లు కొవిడ్‌ టీకా తీసుకున్నాడని ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల ప్రాణానికి ఎలాంటి అపాయం ఉండదని, అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అందుకే ఆ వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఇలా తప్పుడు గుర్తింపు కార్డులతో టీకాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రభుత్వం, వైద్యులు సూచించిన ప్రకారమే టీకాలు, మందులు తీసుకోవాలని వారు కోరారు. దాదాపు అరకోటి జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు 12,500 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 46 మంది వైరస్‌ కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రపంచ దేశాల్లో కరోనాను సమర్థంగా కట్టడి చేసిన దేశాల్లో కివీస్ కూడా ఒకటి.

Also Read:

Vishwanath Dham: కార్మికులపై పూల వర్షం.. తన కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ..

Kareena Kapoor: సెలబ్రెటీలను వదలని మహామ్మారి.. కోవిడ్ భారీన పడిన కరీనా కపూర్, అమృతా అరోరా..

Post Office: మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు ఖాతాలు: కేంద్రం వెల్లడి