AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: సెలబ్రెటీలను వదలని మహామ్మారి.. కోవిడ్ బారీన పడిన కరీనా కపూర్, అమృతా అరోరా..

గత రెండేళ్ల నుంచి యావత్ ప్రపంచాన్ని కోవిడ్ మహామ్మారి వణికిస్తోంది. ప్రపంచదేశాలను ఆర్థికంగానే కాకుండా తీవ్ర ప్రాణ నష్టం

Kareena Kapoor: సెలబ్రెటీలను వదలని మహామ్మారి.. కోవిడ్ బారీన పడిన కరీనా కపూర్, అమృతా అరోరా..
Kareena Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 13, 2021 | 5:35 PM

గత రెండేళ్ల నుంచి యావత్ ప్రపంచాన్ని కోవిడ్ మహామ్మారి వణికిస్తోంది. ప్రపంచదేశాలను ఆర్థికంగానే కాకుండా తీవ్ర ప్రాణ నష్టం కలిగించింది. ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ సమయంలో ప్రపంచం మొత్తం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వైరస్ నియంత్రణకు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. ఇక సినీ పరిశ్రమపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. ఎంతో మంది కళాకారులు కోవిడ్ మహామ్మారికి మరణించగా. మరికొందరు ఈ వైరస్‏ నుంచి కోలుకున్నారు. తాజాగా మరో ఇద్దరూ సెలబ్రెటీలు కరోనా భారీనా పడ్డారు.

బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్ ఖాన్.. అమృతా అరోరాకు కరోనా సోకింది. కోవిడ్ పరీక్షల్లో వీరికి పాజిటివ్ అని తేలీంది. వీరిద్ధరూ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ తెలిపింది. వీరిద్దరూ కలిసి పార్టీలకు హాజరయ్యారని.. అలాగే వీరిని కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. కరోనా వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే కరీనాకు.. అమృతాకు ఒమిక్రాన్ వేరియంట్ ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. కరీనా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ప్రధాన పాత్రలో అమీర్ ఖాన్ నటించగా.. కీలక పాత్రలో టాలీవుడ్ హీరో నాగ చైతన్య కనిపించనున్నారు. ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్లాసిక్ టామ్ హాంక్స్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.

Also Read: Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..

Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..

Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..