Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 may resemble common cold:స్పానిష్ ఫ్లూ, సార్స్, మెర్స్‌ ల్లానే కరోనా వైరస్ కూడా సాధారణ జలుబుగానే మారనుందా ..

ప్రతి వందేళ్లకు ఒక్కసారి కొత్త వైరస్ వచ్చి ప్రపంచాన్ని వణికిస్తుంది. తన ప్రభావం చూపి..మనిషిజీవితాన్ని ప్రభావితం చేస్తోంది. తాజాగా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్‌ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు..

Covid 19 may resemble common cold:స్పానిష్ ఫ్లూ, సార్స్, మెర్స్‌  ల్లానే కరోనా వైరస్ కూడా సాధారణ జలుబుగానే మారనుందా ..
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2021 | 12:44 PM

Covid 19 may resemble common cold :ప్రతి వందేళ్లకు ఒక్కసారి కొత్త వైరస్ వచ్చి ప్రపంచాన్ని వణికిస్తుంది.  స్పానిష్ ఫ్లూ, సార్స్, మెర్స్‌   ఇలా పలు వైరస్ లు మానవులపై తన ప్రభావం చూపి..జీవితాలను ప్రభావితం చేశాయి. చివరకు సాధారణ వైరస్ లా మిగిలిపోయాయి . తాజాగా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్‌ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు మాదిరిగానే మారనుందని శాస్త్రజ్ఞు;లు అంచనా వేశారు. ప్రస్తుతం పాండామిక్ గా ఉన్న ఈ కరోనా వైరస్ ఎండమిక్ ఘా మారిన తర్వాత..దాని తీవ్రత తగ్గిపోతుందని అంచనా వేశారు. ముఖ్యంగా ఈ వైరస్ బారిన పడుతున్న చిన్నారులకు భవిష్యత్ లో సాధారణ జలుబుగానే మారే అవకాశం ఉందని అంచనా వేశారు. సాధారణంగా చిన్న వయస్సులో సోకే ఇన్ఫెక్షన్ల వల్ల రోగ నిరోధక భక్తి లభిస్తుందని అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్త జెన్నీ లావైన్ వెల్లడించారు. ఈ మేరకు సార్స్‌-కోవ్‌-1 తోపాటు మరో నాలుగు కరోనా వైరస్‌ రకాలపై జరిపిన ఈ పరిశోధన పత్రం తాజాగా సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు అందులో ప్రచురితమయ్యాయి. వైరస్ లకు సంబంధించిన వ్యాధి నిరోధక చికిత్సా విధానం, సాంక్రమిక వ్యాధుల అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుతం విజృంభిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత తీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

సాధారణ ప్రజల్లో ఇది విస్తృతంగా వ్యాపించిన తర్వాత ఇది స్థానిక వ్యాధిగా మారే అవకాశం ఉన్నట్లు అమెరికా పరిశోధకులు చెప్పారు. ఇప్పటికే ఈ గ్రూపు వైరస్‌లకు సంబంధించిన వ్యాధినిరోధక చికిత్సా విధానం, సాంక్రమిక వ్యాధుల అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుతం విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ తీవ్రత తీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణ జలుబుకు కారణమయ్యే నాలుగు రకాల కరోనా వైరస్‌లు ప్రస్తుతం వ్యాప్తిలో ఎంతోకాలంగా ఉన్నాయని, ప్రతిఒక్కరు వారి చిన్నతనంలోనే వీటి బారినపడి ఉంటారని తెలిపారు.

నుంచి 5 ఏళ్లలోపు చిన్నారుల్లో సార్స్ కోవ్ – 2 తొలుత సంక్రమించినప్పుడు ఓ వ్యాధిలో కనిపించినా..తర్వాత..దాని తీవ్రత తగ్గి..స్వల్ప వ్యాధిలోగే మారతుందని విశ్లేషిస్తున్నారు. భవిష్యత్ లో వచ్చే రోగాలకు సమర్థంగా ఎదుర్కోవడంలో పని చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధులు ఇంకా వ్యాధి బారిన పడొచ్చని, అయితే..వారి చిన్న వయస్సులో ఉండగా..సోకిన ఇన్ఫెక్షన్ల కారణంగా..రోగ నిరోధక రక్షణను అందిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. టీకాలు వైరస్ తిరిగి రాకుండా..స్వల్పంగా రక్షణను కల్పిస్తుందని తెలిపారు. ఇక ప్రస్తుతం చేపడుతోన్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడగలమని అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో భవిష్యత్ తరాల్లో కరోనా వైరస్ ఓ సాధన వైరస్ గానే మిగిలిపోతుందని తెలుస్తోంది.

Also Read: మాతృత్వం కోసం మరో అమ్మ గర్భాన్ని చీల్చిన మహిళకు మరణ శిక్ష అమలు..