China: చైనాలో ఒమిక్రాన్ టెర్రర్.. లాక్ డౌన్ లో మూడో నగరం.. సాముహిక కరోనా పరీక్షల నిర్వహణ..
China Lock Down: రెండేళ్ళ క్రితం చైనా లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ (Corona Virus).. ప్రపంచ దేశాలను ఇప్పటికీ వనికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి తాజాగా తన పుట్టినిల్లు అయిన చైనా(China)లో మరోసారి ..
China Lock Down: రెండేళ్ళ క్రితం చైనా లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ (Corona Virus).. ప్రపంచ దేశాలను ఇప్పటికీ వనికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి తాజాగా తన పుట్టినిల్లు అయిన చైనా(China)లో మరోసారి విజృంస్తోంది. డ్రాగన్ కంట్రీలోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతూ ఆదేశ పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వింటర్ ఒలింపిక్స్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.. మళ్ళీ ఈ వైరస్ ప్రజలపై పంజా విసురుతూ పాలకులకు, అధికారులకు సవాల్ విసురుతోంది. దీంతో జోరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోన్న అధికారులకు ఈ వైరస్ ను కట్టడి చేయడం సవాల్ గా మారింది. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద నగరాలైన షియాన్, టియాంజిన్‌లలో లాక్ డౌన్ విధించడమే కాదు.. అక్కడ కరోనా కట్టడి కోసం కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఆయతే తాజాగా ఇప్పుడు మరో నగరం లాక్ డౌన్ (lock down) బాట పట్టింది. తాజాగా అన్యాంగ్ నగరంలోనూ లాక్‌డౌన్ విధించింది. దీంతో డ్రాగన్ కంట్రీలో లాక్ డౌన్ విధించిన నగరాల సంఖ్య ౩కు చేరుకుంది.
ఓ వైపు కరోనా వైరస్ కేసులు మళ్ళీ భారీగా నమోదు అవుతుండగా ఇప్పుడు ఒమిక్రాన్ జత చేరింది. సెంట్రల్ హెనాన్ ప్రావిన్సు లోని అన్యాంగ్ నగరంలో కొత్తగా 84 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అధికంగా స్థానికంగా వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. బాధితుల్లో కొంతమంది టియాంజిన్ మునిసిపాలిటీకి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తులతో సంబంధముందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ చేసే పనిలో పడ్డారు. నగరంలో కరోనా టెస్టులను నిర్వహించేందుకు లాక్ డౌన్ విధించా
55లక్షల జనాభా కలిగిన అన్యాంగ్ నగరంలోని ప్రజలు ఎవ్వరూ ఇంటినుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఓ వైపు టెస్టుల నిర్వహణకు ఏర్పాటు చేస్తూనే మరోవైపు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు అధికారులు. ప్రజలు అత్యవసర సేవలకు మినహా బయటకు రావద్దని తెలిపారు. అంతేకాదు ఈ లాక్ డౌన్ ఎంతకాలం ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు. సాముహిక కరోనా పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ పరీక్షలు ఎప్పటికి ముగుస్తాయో తెలియదన్నారు.
ఉత్తర ఓడరేవు నగరమైన టియాంజిన్ ఇప్పటికే డెల్టా వ్యాప్తితో పోరాతుండగా.. ఇప్పుడు ఓమిక్రాన్ కూడా అడుగు పెట్టింది. దీంతో అధికారులు పాక్షికంగా లాక్ డౌన్ ఆంక్షలను విధించారు. ఆ దేశంలో ప్రముఖ పర్యాటక రంగమైన షియాన్ నగరంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఆయా నగరాలలోని ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ను చేస్తున్నారు. కోటికి పైగా జనాభా ఉన్న ఆయా నగరాల్లో ప్రజలకు పరీక్షలు చేయడం అధికారులు సవాల్ గా మారింది.
2019లో చైనా లోని వుహాన్‌లో కోవిడ్ వెలుగు చూసింది. అనేక రూపాలను సంతరించుకుంటున్న కరోనా వైరస్ .. తాజాగా ఒమిక్రాన్ గా మారి.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓ వైపు బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరగనుండగా.. మరో వైపు పలు నగరాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read: