అరుణ గ్రహంపై మా ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రాలు ఇవిగో, చైనా స్పేస్ ఏజన్సీ
అంగారక గ్రహంపై తమ తియాన్ వెన్ -1 ఉపగ్రహం తీసిన ఇమేజీలను చైనా స్పేస్ ఏజన్సీ విడుదల చేసింది. ఇవి హై రిసోల్యుషన్ ఇమేజీలని ఈ సంస్థ ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం అరుణ గ్రహ కక్ష్యలో ఉందని చైనా స్పేస్ వర్గాలు తెలిపాయి.

అంగారక గ్రహంపై తమ తియాన్ వెన్ -1 ఉపగ్రహం తీసిన ఇమేజీలను చైనా స్పేస్ ఏజన్సీ విడుదల చేసింది. ఇవి హై రిసోల్యుషన్ ఇమేజీలని ఈ సంస్థ ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం అరుణ గ్రహ కక్ష్యలో ఉందని చైనా స్పేస్ వర్గాలు తెలిపాయి. గత ఏడాది జులై 23 న దీన్ని లాంచ్ చేయగా 224 రోజుల్లో 475 మిలియన్ కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. తియాన్ వెన్-1 లో ఆర్బిటర్, లాండర్, రోవర్, అత్యంత శక్తి మంతమైన కెమెరాలు ఉన్నాయి. భూమి నుంచి దాదాపు 7 నెలలు ప్రయాణించిన ఇది గత ఫిబ్రవరి 24 న అంగారక గ్రహ కక్ష్యను చేరింది. ఈ నెల 4 న చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ మార్స్ ఉపరితలంపైని నూతన ఇమేజీలను విడుదల చేసింది. వీటిలో ఒకటి కలర్ ఇమేజీ కాగా మిగిలినవి పాంక్రోమాటివ్ ఛాయా చిత్రాలు. కలర్ ఇమేజీ అంగారక గ్రహ ఉత్తర ధ్రువ ప్రాంతమని ఈ సంస్థ పేర్కొంది.నార్త్ పోల్ ప్రాంతంలో ఎలా ఉందన్నది ఈ ఇమేజీలో స్పష్టంగా ఉంది.
అరుణ గ్రహంపై గల చిన్నపాటి గుంతలు, శిఖరాల రిడ్జ్ లు ఈ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ గ్రహ ఉపరితలానికి పైన 330 నుంచి 350 కి.మీ. దూరంలో ఉండగా తియాన్ వెన్-1 ఈ ఇమేజిలను తీసిందట. కలర్ ఫోటో తీసేందుకు ఓ కెమెరాను, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను తీసేందుకు మరో కెమెరాను వాడినట్టు చైనా స్పేస్ ఏజన్సీ వెల్లడించింది. కాగా… ఈ ఉపగ్రహం వచ్ఛే మే నెల లేదా జూన్ లో మార్స్ పై దిగవచ్చునని భావిస్తున్నారు. ఏమైనా చైనా సంస్థ విడుదల చేసిన ఫోటోలు అరుణగ్రహ ఉపరితలాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. త్వరలో తాము మరికొన్ని ఫోటోలను రిలీజ్ చేస్తామని చైనా ప్రకటించింది.
Amazing! The China National Space Administration (#CNSA) today published high-resolution images of #Mars captured by china’s #Tianwen1 probe. They include two panchromatic images and one color image. pic.twitter.com/c4NKOZdycW
— Ambassador Deng Xijun (@China2ASEAN) March 4, 2021
మరిన్ని ఇక్కడ చదవండి:
AP Corona: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎంతమంది కోవిడ్ బారిన పడ్డారంటే..?