China Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. దిగుమతిపై నిషేధం విధించిన చైనా.. సూపర్ మార్కెట్లు బంద్

China Dragon Fruit: కరోనా వైరస్ పుట్టిల్లు అయినా చైనా లో ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం డ్రాగన్ కంట్రీ చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ కోవిడ్ కల్లోలం..

China Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. దిగుమతిపై నిషేధం విధించిన చైనా.. సూపర్ మార్కెట్లు బంద్
China Shuts Supermarkets
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2022 | 12:18 PM

China Dragon Fruit: కరోనా వైరస్ పుట్టిల్లు అయినా చైనా లో ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం డ్రాగన్ కంట్రీ చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ కోవిడ్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. వెట్ మార్కెట్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు తినే పండులో కూడా కనిపిస్తూ ఆందోళన కలిగిస్తుంది.

తాజాగా.. వియత్నాం నుండి దిగుమతి చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనావైరస్ నమూనాలను కనుగొన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అందుకనే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.. డ్రాగన్ ఫ్రూట్ పై చైనా ఈనెల 26వరకూ నిషేధం విధించింది. వియత్నాం నుంచి డ్రాగన్​ఫ్రూట్​ దిగుమతిని రద్దు చేసింది. ఆ పండు ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆధారాలు లేకపోయినా​ ముందు జాగ్రత్తగా కొనుగోలుదారులు క్వారంటైన్ అవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు సూపర్ మార్కెట్లు  మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

డ్రాగన్​ ఫ్రూట్​లో కరోనా ఆనవాళ్లు గుర్తించినట్లు అధికారులు ఇటీవల చెప్పారు.  దేశంలోని జేజియాంగ్, జియాన్జి ప్రావిన్సుల్లోని తొమ్మిది నగరాల్లో వియత్నాం డ్రాగన్​ ఫ్రూట్​లో కరోనా ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులను స్క్రీనింగ్‌ చేసిన సమయంలో ఈ వైరస్ ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అయితే   ఆహారం నుండి కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని.. అయినప్పటికీ డ్రాగన్ ఫ్రూట్స్ దిగుమతిపై తాము కొన్ని రోజులు నిషేధం విధించామని తెలిపారు. అంతేకాదు దేశంలోని అనేక ప్రాంతాల్లోని సూపర్​మార్కెట్లను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మూసివేయాలని స్పష్టం చేసింది.

Also Read:   మీకు ఎంత బెస్ట్ ప్రెండ్ అయినా ఈ విషయాలను ఎప్పుడూ పంచుకోవద్దంటున్న చాణక్య..